సుశాంత్ మరణం పై సీబీఐ ఎంక్వైరీని సిఫారస్ చేసిన బీహార్ ప్రభుత్వం

Advertisement

పాట్నా: బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న తన అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే సుశాంత్ మరణం పై రోజుకో వివాదం బయటకు వస్తుంది. సుశాంత్ ది ఆత్మ హత్య కాదని, తనని బాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులు ఒక ప్లాన్ ప్రకారం చంపారని నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే దీని తరువాత సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ అయిన రీయాపై సుశాంత్ తండ్రి వివిధ సెక్షన్స్ కింద పాట్నాలో కేస్ నమోదు చేశారు.

దీని తరువాత కేస్ విచారణ నిమిత్తం ముంబై వెళ్లిన ఐపీఎస్ అధికారి వినయ్ తివారిని డొమెస్టిక్ నిబంధనల ప్రకారం ముంబై పోలీసులు క్వారంటైన్ చేశారు. దీనితో ముంబై పోలీసుల వ్యవహారంపై బీహార్ డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై పోలీసులు తమకు సహకరించడం లేదని తెలిపారు. ఇలా కేస్ విచారణలో ఎన్నో అడ్డంకులు వస్తుండటంతో బీహార్ గవర్నమెంట్ సుశాంత్ కేస్ లో సీబీఐ ఎంక్వైరీని సిఫారస్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here