Bihar: మొన్న రూ.50 కోసం గొడవ, ఇప్పుడు రూ.10 కోసం గొడవ…
Samsthi 2210 - September 1, 2021 / 06:29 PM IST

Bihar: మనుషులలో పగ, పత్రీకారాలు బాగా పెరిగిపోతున్నాయి. ఒక్క మాట అంటే చాలు ఎదుటివాడిని చంపడానికే రెడీ అవుతున్నారు. ఆ మధ్య రూ. 50 కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు. 50 రూపాయల కోసం ఇద్దరు యువకులు గొడవపడ్డారు. అప్పు విషయంలో పాలడైరీలో యువకులకు ఘర్షణకు దిగారు. డైరీలో గుమస్తాగా పనిచేస్తున్న యువకుడు బాజీ అనే వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించడంతో కుప్పకూలి చనిపోయాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి 5న పొరుగింటి వ్యక్తికి చెందిన ఏడాదిన్నర బాలుడు ఒంటరిగా ఉండటం చూసి అతన్ని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి , వాటర్ ట్యాంకులో ముంచి హత్య చేశాడు. అక్కడ హత్యకు కారణం కూడా రూ.50. తాజాగా బీహార్‌లో రూ. 10 కోసం గొడవ జరగగా, ఓ వ్యక్తి మృతి అందరిని కలిచివేస్తుంది.
సమస్తిపూర్ జిల్లాలో బన్‌భౌరా గ్రామానికి చెందిన సికల్ యాదవ్ అనే యువకుడు గత కొద్ది కాలంగా బోటు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బోటులో ప్రయాణించారు.. బోటులో ప్రయాణించినందుకు చార్జీగా రూ.10 అడిగాడు. ఈ క్రమంలో యువకుడితో వారు గొడవపడ్డారు.
గ్రామస్తులు జోక్యం చేసుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే సోమవారం ఉదయం సికల్ యాదవ్ తన ఇంటి ముందు నిలబడి ఉన్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆ యువకుడు సంఘటన స్ధలంలో మృతిచెందాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.