BiggBoss5 : సిరి-ష‌ణ్ముఖ్ మ‌ధ్య బిగ్ డ్రామా.. ర‌క్తంతో త‌న ఫ్రెండ్‌కి దిష్టి తీసిన హ‌న్మంతు

BiggBoss5 : బిగ్ బాస్ హౌజ్‌లో నామినేష‌న్ హీట్ ఇంకా చ‌ల్లార‌లేదు. ఆనీ మాస్టర్ మరోసారి తన నోటి దురుసు చూపించింది. ‘కాజల్ ఎందుకు డ్రామాలు ఆడుతుంది? ఎప్పుడూ గేమ్‌లోనే ఉంటుందా? స్ట్రాటజీ-కెమెరాల కోసమేనా? నువ్ ఇలాంటి దానివి అలాంటి దానికి అని నేను కాజల్‌ని అంటున్నానా? అంటూ శ్రీరామ్ దగ్గర నోరు పారేసుకుంది ఆనీ మాస్టర్.

BiggBoss5 Siri and Shanmukh relation goes wrong
BiggBoss5 Siri and Shanmukh relation goes wrong

ఇక బిగ్ బాస్ హౌస్ గుంటనక్క అనే పేరుని సార్ధకం చేసుకుంటూ యాంకర్ రవి.. కాజల్ ఏడ్చిన దాన్ని వెటకారం చేస్తూ వెళ్లి షణ్ముఖ్ దగ్గర ఊదాడు. అయితే షణ్ముఖ్.. నా స్టేట్ మెంట్‌కి ఏడుస్తుందంటే.. నా పాయింట్ కరెక్టే అన్నమాట అందుకే ఏడుస్తుంది అని అతితెలివిని చూపించాడు.

BiggBoss5 Siri and Shanmukh relation goes wrong
BiggBoss5 Siri and Shanmukh relation goes wrong

ప్రియాంక సన్నీ దగ్గర కూర్చుని మానస్ గురించి తెగ బాధపడిపోయింది. మానస్ గేమ్ నేను ఆడుతున్నానని ఎలా అంటున్నారన్నయ్యా.. అని సన్నీ దగ్గర అంటే.. అతి ప్రేమ కూడా ప్రమాదమే అని అన్నాడు సన్నీ. ‘నేను మానస్ పట్ల అతి ప్రేమ ఏం చూపించానా అన్నయ్యా’ అంటూ భయంకరమైన జోక్ వేసింది ప్రియాంక.

BiggBoss5 Siri and Shanmukh relation goes wrong
BiggBoss5 Siri and Shanmukh relation goes wrong

ఐ లైక్ మానస్.. బట్ నా గేమ్ నేనే ఆడుకుంటున్నా.. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అంటే.. అది బయటకు వేరే విధంగా వెళ్తుంది. ఎందుకంటే మానస్ ఒక హీరో.. ఒక ట్రాన్స్ జెండర్ వచ్చి మానస్‌ని ఇష్టపడుతుంది.. మానస్‌ని ప్రేమిస్తుందని అంటే అది ఇక్కడ సెట్ కాదు. నా జీవితంలో ఇలాంటి వాళ్లని ఎంతో మందిని చూశా’ అని ప్రియాంక బాధపడింది.

హౌస్‌లో తక్కువ మంది ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 17 కెమెరాలు 19 మంది ఉన్నప్పుడు వేరు.. 17 కెమెరాలు 9 మంది ఉన్నప్పుడు వేరు.. చాలా వేరు అని సిరికి హితబోధ చేశాడు. నీ క్యారెక్టర్ గురించి మిగిలిన వాళ్లు ఈ అమ్మాయి ఇలాంటిది అని ఎందుకు అనుకోవడం లేదంటే.. నువ్ టాస్క్‌లు బాగా ఆడుతున్నావ్.. మన ఫ్రెండ్ షిప్ బాగా ఉంది.. ఈ టైంలో మనపై చిన్న మచ్చ కూడా పడకూడదు.. అది వేరే వాళ్లకి ప్లస్ కాకూడదు. చిన్న మిస్టేక్‌తో టాప్ 5 మిస్ కావొచ్చు..

అదే చిన్న పాయింట్ విన్నింగ్ ఛాన్స్ మిస్ కావొచ్చు. అప్పుడు అనిపిస్తుంది.. ఆ చిన్న మిస్టేక్ చేయకుండా ఉండాల్సిందని బాధపడతావ్..మనం ఇద్దరం ఒకే బెడ్‌పై పడుకోకుండా ఉంటే.. జనం పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్లు మారిపోయారు అని అనుకుంటారు. అందుకే మనం అదొక్కటే మారుద్దాం.. ఒకే బెడ్‌పై పడుకోవద్దు అని చెప్పాడు షణ్ముఖ్.

సన్నీని అన్నయ్య అని పిలు.. ఏ చెల్లిని తిడతాడో నేను చూస్తా.. అన్నయ్య అని పిలిస్తే చెల్లి అని ఫీల్ అవుతాడు కదా.. అప్పుడు తిడతాడో లేదో చూస్తా.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడో లేదో చూస్తా అని సిరి-సన్నీల మరింత గ్యాప్ పెంచేలా షణ్ముఖ్ మాట్లాడాడు.

షణ్ముఖ్‌కి దిష్ఠి ఎక్కువ తగిలేస్తుందట.. అందుకోసం అతనికి దిష్టి పూసలు రవితో కట్టించింది. షణ్ముఖ్ అడ్డా.. మోజ్ రూంలోకి వెళ్లి సన్నీ మాట్లాడుతుండగా.. సిరి వచ్చి దిష్ఠి పూసలు బ్యాండ్ తొడిగింది. ఇదేంటి అని షణ్ముఖ్ అడగ్గా.. బ్లడ్ అని చెప్పింది. బ్లడ్ ఏంటి అని షణ్ముఖ్‌తో పాటు చూసి ఆడియన్స్‌ కూడా తింగర మొహాలు వేసే పరిస్థితి రాగా.. అవును నా బ్లడ్‌ని పూసలకి రాసి బ్యాండ్ చేశా.. దాని వల్ల నీకు దిష్ఠి తాకదు అని చెప్పింది.

కరెక్ట్‌గా ఎనిమిది పూసలు పెట్టింది.. నేను కాకుండా ఎనిమిది మంది ఉన్నారుగా.. ఆ ఎనిమిది మంది నుంచి దిష్ఠి తగలకుండా ఎనిమిది పూసలు పెట్టింది అని ఎదురుగా ఉన్న సన్నీతో చెప్పి నవ్వుకున్నాడు షణ్ముఖ్. ఆ తరువాత బ్లడ్‌తో ఎందుకు చేశావ్.. కోసుకున్నావా? లేదంటే తెగిందా? అని షణ్ముఖ్ అడగ్గా.. నార్మల్‌గానే వచ్చిందిలే అని చెప్పింది. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య బెడ్ గురించి సైగలు జరిగాయి.

సన్నీ.. ఆనీ మాస్టర్ నామినేషన్స్‌లో చేసిన దాన్ని గుర్తు చేస్తూ ఆమెను ఇమిటేట్ చేసి నవ్వించాడు. ఆ టైంలో సిరి సోఫాలో కూర్చుని నవ్వింది. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ.. ‘డబుల్ ఫేస్ అంటే ఇదే.. గంటలు గంటలు సోఫా ముందు కూర్చుని నవ్వుతున్నావ్.. సన్నీ ముందు మాట్లాడే ధైర్యం లేదు నీకు అని షణ్ముఖ్ అనడంతో.. సన్నీ ముందే అన్నాను అని చెప్పడంతో వాడికి ఎందుకు హైప్ ఇస్తున్నావ్ అని అడిగాడు షణ్ముఖ్.

ఇలా ఉంటే నువ్ నాతో ఉండొద్దు.. వెళ్లిపో ఇక్కడ నుంచి.. అవసరం లేదు.. నిన్ను మర్చిపోతాను. నీతో నాకు ఇంక అయిపోయింది.. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు.. నువ్ నాకు వద్దు.. నువ్ ఉన్నా ఫరక్ కూడా పడటం లేదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు షణ్ముఖ్. దీంతో సిరి.. నాకు తెలుసు నువ్ మరిచిపోతావ్ అని ఏడ్వడం మొదలుపెట్టింది.

ఆ తరువాత కెప్టెన్సీ టాస్క్ మొదలుకావడం వీళ్ల మధ్య డ్రామా పీక్స్‌లోకి వెళ్లిపోయింది. షణ్ముఖ్ వాష్ రూం దగ్గర కూర్చుని దీప్తిని తలుచుకుని ఏడ్వడం.. సిరి వచ్చి ఓదార్చడం.. ఆ టైంలో కూడా సిరి వెళ్లిపో అని అనడం.. సిరి ఏడుస్తూ బాత్ రూంలోకి వెళ్లడం.. రవి వచ్చి సీన్‌కి మరింత హైప్ ఇవ్వడం.. బాత్ రూంలోకి వెళ్లిన సిరి తల గోడకోసి కొట్టుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేయడం జ‌రిగింది.