BiggBoss5 : మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో క‌లిసి ర‌చ్చ చేసిన జ‌స్వంత్

BiggBoss5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మంతో చాలా మంది పాపులారిటీ ద‌క్కించుకుంటున్నారు. హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారంటే వారికి అమిత‌మైన ఇమేజ్ పెరిగిపోతుంది. రీసెంట్‌గా అనారోగ్యంతో బ‌య‌ట‌కు వ‌చ్చాడు జ‌స్వంత్ ప‌డాల‌. మోడల్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన ఆయ‌న సిరి-ష‌ణ్ముఖ్‌తో తెగ సంద‌డి చేశాడు.

BiggBoss5 jessie chilling with old contestants
BiggBoss5 jessie chilling with old contestants

బిగ్ బాస్ సీజన్ 5 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు జస్వంత్. ఈ మేల్ మోడల్ మొదటివారం నుండి తన మార్క్ గేమ్ కనబరుస్తున్నారు. టాస్క్ లలో శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తాడు. తాను ఉన్న‌ తొమ్మిది వారాల్లో ఓ సారి కెప్టెన్ కూడా అయ్యాడు. సున్నిత మనస్కుడిగా జస్వంత్ కి పేరుంది.

BiggBoss5 jessie chilling with old contestants
BiggBoss5 jessie chilling with old contestants

గ‌త కోద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ వ‌చ్చిన జస్వంత్ ఆరోగ్యం కుద‌ట ప‌డ‌క‌పోవ‌డంతో, ఈ నేపథ్యంలో అతన్ని హౌస్ నుండి బయటికి పంపడమే ఉత్తమం అని బిగ్ బాస్ భావించారు. జస్వంత్ ని సీక్రెట్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్.. ఈ విషయం అతనికి వెల్లడించడం జరిగింది. బిగ్ బాస్ నిర్ణయాన్ని అంగీకరించిన జస్వంత్.. రూమ్ నుండి బయటికి వచ్చి, కంటెస్టెంట్స్ తో దగ్గర ఎమోషనల్ అయ్యాడు. హౌస్ నుండి వెళ్ళిపోతున్నట్లు తెలియజేశాడు.

ఆ త‌ర్వాత అత‌నిని సీక్రెట్ రూంకి పంపి వైద్యం అందించారు. అయిన ఆరోగ్యం కుదుట‌ప‌డ‌లేదు. దీంతో నాగార్జున అత‌నిని ఎలిమినేట్ చేశాడు. అనారోగ్యం వ‌ల‌న నామినేష‌న్‌లో లేక‌పోయిన బ‌య‌ట‌కు రావ‌ల‌సి వ‌చ్చింది. జస్వంత్ నిష్క్రమణతో హౌస్ లో మొత్తం తొమ్మిది మంది మిగిలారు.

బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత జ‌స్వంత్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో క‌లిసి చిల్ అయ్యాడు. అషూ రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్‌, అలీ రెజా, భాను శ్రీల‌తో క‌లిసి ఫోటోలు దిగాడు. ఇవి ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.