BIGGBOSS: నాలుగో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ భామ‌.. రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్న నెటిజ‌న్స్

BiggBoss: సెల‌బ్రిటీలు అంద‌రికి ఆద‌ర్శంగా నిల‌వాల్సి ఉంటుంది. వారు వేసే ప్ర‌తి అడుగు చాలా జాగ్రత్త‌గా వేయాలి. అభిమాన స్టార్స్ త‌ప్పుడు దారిలో వెళితే అభిమానులు కూడా అదే మార్గంలో వెళ్లే ప్ర‌మాదం ఉంది. అయితే కొంద‌రు సెల‌బ్రిటీలు అవేమి ప‌ట్టించుకోకుండా వారు చేసే వ్య‌వ‌హారాల వ‌ల‌న వివాదంలో నిలుస్తూ ఉంటారు. సీనియర్‌ నటుడు విజయ్‌, నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వ‌నిత గ‌త కొద్ది రోజులుగా సెన్సేష‌న‌ల్‌గా మారింది.

‘చంద్రలేఖ’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన వ‌నిత విజ‌య్ కుమార్ తమిళ బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొని అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది. ఈ అమ్మ‌డు త‌న ప్రొఫెష‌న‌ల్ విష‌యాల క‌న్నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. ఇప్పటికే మూడుసార్లు పెళ్లి చేసుకుని, ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చి పలు విమర్శలను ఎదుర్కొన్న వ‌నిత ప్రస్తుతం తన పిల్లలతో కలిసి జీవిస్తుంది. తన భర్త ఎవరని అడుగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేసింది వనితా విజయ్‌కుమార్ .

ఇక ఇటీవ‌ల ఓ టెలివిజన్ షోలో అడుగుపెట్టాక నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆ షో నుండి వెళ్లిపోయినట్లు లేఖ ద్వారా తెలిపింది వ‌నిత‌. తన వర్క్ ప్లేస్ లో కొందరు అనైతికంగా, వ్యతిరేకంగా స్పందించారని బాధపడింది. తన ఇగోతో తనను దారుణంగా ప్రవర్తించారని, మగవాళ్లే కాకుండా ఆడవాళ్లు కూడా తన ఎదుగుదల చూసి తట్టుకోలేకపోయారని తెలిపింది. భర్త సపోర్ట్ లేకుండా అంతేకాకుండా ముగ్గురు పిల్లల తల్లిని అయ్యి కూడా కెరీర్ పరంగా ఎదుగుతుంటే కొంద‌రు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని కామెంట్స్ చేసింది.

తోటి మహిళలకు తోటి మహిళ సహాయం పడాలనే ఆలోచన లేద‌ని అన్న వనిత ఇన్‌డైరెక్ట్‌గా ర‌మ్య‌కృష్ణ‌ని టార్గెట్ చేసింది. అయితే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి డైవ‌ర్స్ ఇచ్చిన వ‌నిత ఇప్పుడు నాలుగో పెళ్లితో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ మ‌ధ్య ఓ జ్యోతిష్యుడు వనితతో ఏడడుగులు నడిచే వ్యక్తి పేరు ‘S’ అక్షరంతో మొదలవుతుందని , దివంగత సీఎం జయలలితలా పాలిటిక్స్‌లోనూ తన సత్తా చాటుతుందని పేర్కొన్నాడు.

జ్యోతిష్‌కుడు అన్న‌ట్టుగానే త‌మిళ ప‌వ‌ర్ స్టార్ శ్రీనివాస‌న్‌తో వ‌నిత పెళ్లి జ‌రిగింద‌ని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది వ‌నిత‌. దీంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుందా? అని కొందరు అభిమానులు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. అయితే ఇది సినిమాలోని స్టిల్ అని కొంద‌రు అంటున్నారు.పూర్తి క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.