Biggboss 6 : బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్: అరరె.! రాజ్ వికెట్ పడిపోయిందే.!

NQ Staff - November 26, 2022 / 10:27 PM IST

Biggboss 6 : బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్: అరరె.! రాజ్ వికెట్ పడిపోయిందే.!

Biggboss 6 : అరరె.! రాజ్ వికెట్ పడిపోయిందే.! ఔను, ఇప్పుడు ఇలాగే అనుకుంటున్నారంతా. ‘రాజ్ కంటే వేస్ట్ కంటెస్టెంట్లు చాలామందే వున్నారు.. వాళ్ళని పంపించెయ్యొచ్చు కదా..’ అంటూ రాజ్ అభిమానులు, సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు.

వీకెండ్ ఎలిమినేషన్‌లో ఈసారి రాజ్ వికెట్ ఔట్ అయిపోయినట్లుగా బిగ్ బాస్ హౌస్ నుంచి లీక్స్ బయటకు వచ్చాయి. గత వారం ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి రాజ్, ఇమ్యూనిటీ పొందిన సంగతి తెలిసిందే. దాంతో, రాజ్ టాప్ ఫైవ్‌లో వుంటాడని అంతా అనుకున్నారు.

ఓట్లు తక్కువ వచ్చాయా.? స్క్రిప్టు ప్రకారమే నడుస్తోందా.?

మొదటి వారం నుంచీ ఇదే రచ్చ.! ఆ మాటకొస్తే, గత కొన్ని సీజన్లుగా ప్రతిసారీ ఇదే ఆరోపణ తెరపైకొస్తోంది. రాజ్ విషయంలోనూ అన్యాయమే జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిజానికి, ఈ సీజన్ మొత్తంలో రాజ్ ఒకింత బాగానే ఆడాడు.. అస్సలేమాత్రం ఆడని కంటెస్టెంట్స్‌తో పోల్చితే బెటరే.! అయినాగానీ, గతంలోనే ఎలిమినేట్ అయిపోవాల్సిన రాజ్, ఇన్నాళ్ళపాటు హౌస్‌లో వుండడం విశేషంగానే చెప్పుకోవాలేమో.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us