ఇదిరా టాస్క్ అంటే..!
Admin - September 23, 2020 / 05:01 AM IST

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4. అప్ డేట్స్..
ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిజికల్ టాస్క్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం వచ్చిన ఫిజికల్ టాస్క్ అదిరిపోయింది. దీంతో హౌస్ లో ఎవరి మెంటాలటీ ఎలా ఉంటోంది అనేది చక్కగాతెలిసిపోతోంది. టాస్క్ ఆడటానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో.. ఎదుటివారిని గుంజి పారేయడానికి కూడా అలాగే ఉన్నారు. ఇక్కడే మెహబాబు గేమ్ చాలా ఆడ్ గా అనిపించింది. అంతేకాదు, ఇదే విషయాన్ని అభిజిత్ ఎక్స్ ప్లెయిన్ చేశాడు కూడా. ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయినపుడే , మెహబూబ్ – సోహైల్ – నోయల్ వీరిని ఆపడం మన వల్ల కాదు అంటూ చెప్పేశాడు. కానీ, దేవి లెట్స్ ఫైట్ ఓడిపోతే ఓడిపోతాం అంటూ ఎంకరేజ్ చేసింది. దీంతో అభిజిత్ కి కాస్త ధైర్యం వచ్చింది.
ఆ తర్వాత గేమ్ లో బాగా ఇన్వాల్ అయ్యాడు. ఇక్కడ దేవి ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ అంటే.. కేవలం మైండ్ తోనే గేమ్ ఆడుతోంది. అందుకే నోయల్ అండ్ టీమ్ ముందుగా దేవి రోబోని చంపాలని డిసైడ్ అయ్యారు.
సిల్వర్ బాల్ కోసం మెహబూబ్, సుజాత, సోహైల్ ముగ్గురూ కూడా కాస్త రూడ్ గానే ఆడారు. మెహబూబ్ అయితే గంగవ్వ దగ్గర ఉన్న బాల్ ని బలవంతంగా లాక్కున్నాడు.
ఇలాంటి గేమ్స్ తోనే ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటకి వస్తాయి. ముందుగానే నోయల్ ఎంత స్మార్ట్ గేమ్ ఆడాడు అంటే.., ఫుడ్ ని తీసుకున్నారు. అలాగే బ్లాంకెంట్స్ ని తీసుకుని బయటకి వచ్చారు. అలాగే మోనాల్ కూడా తనకి కావాల్సినవి అన్నీ బయటపెట్టేస్కుంది. అందరూ చాలా స్మార్ట్ గేమ్ ఆడారు. ఇక్కడే దివి అండ్ సుజాతలకి వాష్ రూమ్ వస్తే.. అమ్మరాజశేఖర్ అండ్ మెహబూబ్ బ్లాంకెట్స్ పట్టుకున్నారు.
నోయల్ ఎదురుగా ఉన్న కెమెరాని కవర్ చేసాడు. ఇది చాలా అన్ ఫెయిర్ గేమ్ లాగా అనిపించింది రోబో టీమ్ కి. అంతేకాదు, బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తీవ్రమైన శిక్ష ఉంటుంది అని హెచ్చరించాడు. అయినా కూడా లైట్ తీసుకుంటున్నారు హౌస్ మేట్స్…
ఇప్పుడు టాస్క్ లో పెద్ద గొడవే జరగబోతోంది. ఏంటంటే.. బెడ్ రూమ్ లో దివి రోబోల చేతికి చిక్కింది. హౌస్ యాక్సెస్ మిగతా మనుషులకి లేకుండా పోయింది. దీంతో రోబోలు అన్నీ ఛార్జ్ చేసుకుంటున్నారు. అంతేకాదు…, బయట ఉన్న నోయల్ – మెహబూబ్ – సోహైల్ లు వీర ఆవేశంతో రెచ్చిపోతున్నారు. మోనాల్ కూడా బుద్దిలేదు మీకు అంటూ తిడుతోంది. దీన్ని బట్టీ చూస్తే ఈ టాస్క్ ఖచ్చితంగా వేడెక్కుతోంది అర్ధం అవుతోంది.
చూసేవాళ్లకి ఇదిరా టాస్క్ అంటే అనిపించేలాగా హౌస్ మేట్స్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సోహైల్ కుమార్ సాయి పై అరుస్తున్నాడు… ఇక టాస్క్ లో ఖచ్చితంగా మంచి కిక్ వస్తుందనే అనుకుంటున్నా.. చూద్దాం..