Bigg Boss 7 Telugu : అర్జున్-ప్రశాంత్ ల మధ్య మాటల యుద్ధం.. రతికకు బిగ్ బాస్ వార్నింగ్..!
NQ Staff - November 14, 2023 / 10:17 AM IST

Bigg Boss 7 Telugu :
దీపావళి స్పెషల్ ఎపిసోడ్ అయిపోయింది పదో వారంలో భోలే షావలి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక పదకొండో వారినికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం నాడు మొదలైంది. పదో వారానికి సంబంధించి శివాజీ, రతిక, గౌతమ్, యావర్, భోలే నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ యావర్, భోలే షావలి డేంజర్ జోన్ లెకి వెళ్లారు. అయితే చివరగా భోలే షావలి ఎలిమినేట్ అయిపోయాడు. భోలే ఎలిమినేట్ కావడంతో అశ్విని గుక్క పెట్టి ఏడ్చేసింది. ఇక దీపావళి ఎపిసోడ్ లో స్టేజి మీదకు ఇతర సెల్రబిటీలు కూడా వచ్చారు. అయితే సోమవారం నామినేషన్స్ రచ్చ రచ్చగానే సాగాయి.
బిగ్ బాస్ లో ఒక్కో కంటెస్టెంట్ బిగ్ బాస్ ఇచ్చి బాటిల్స్ ను తలపై పగలగొట్టి ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక శివాజీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి అతను నామినేషన్స్ నుంచి దూరంగా ఉన్నాడు. దాంతో మిగిలిన వారు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. అందరికంటే ముందు రతిక రోజ్ నామినేషన్స్ కు వచ్చింది. అయితే ఆమె వచ్చినా కూడా నామినేషన్స్ స్టార్ట్ చేసే సరికి ఇంకా సమయం పడుతుందని చెప్పడంతో బిగ్ బాస్ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఆలస్యం చేస్తే నేరుగా బిగ్ బాస్ నామినేట్ చేస్తాడని వార్నింగ్ చెప్పాడు.
ఇక చేసేది లేక రతిక నామినేట్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఆమె శోభాశెట్ట పేరు చెప్పింది. గత వారం ఆమె కెప్టెన్సీని సరిగ్గా వాడుకోలేదంటూ వివరించింది. అదే కారణంతో ప్రియాంకను కూడా నామినేట్ చేసింది. దాంతో ఈ ముగ్గురి నడుమ మాటల యుద్ధం సాగింది. తర్వాత అర్జున్ వచ్చాడు. అతను పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశౄడు. ఏదో కారణం చెప్పినా ప్రశాంత్ పట్టించుకోలేదు. దాంతో ఇద్దరి నడుమ వాగ్వాదం నడిచింది. ఆ తర్వాత శోభాశెట్టిని నామినేట్ చేశాడు. ఆమె కెప్టెన్సీని సరిగ్గా నిర్వహించలేదని చెప్పుకొచ్చాడు అర్జున్.
ఇక ప్రియాంక వంతు రావడంతో ఆమె నేరుగా రతిక రోజ్ ను నామినేట్ చేసింది. ఇంకేముంది ఈ ఇద్దరి నడుమ కూడా మాటల యుద్ధం కాసేపు నడిచింది. శివాజీ జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పినా సరే అది సర్దుమనగలేదు. ఇక చివరగా రతిక మీద బాటిల్ పగలగొట్టింది ప్రియాంక.
ఆ తర్వాత అశ్వినిని నామినేట్ చేసింది. ఆమె చివరి వారం మొత్తం చాలా కఠినంగా వ్యవహరించింది అంటూ చెప్పింది. ఇక దాంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. పూర్తిగా నామినేషన్స్ మాత్రం జరగలేదు.