Bigg Boss Telugu 7 : శివాజీ, యావర్ ఫినాలే రేస్ నుంచి ఔట్.. ఆ ముగ్గురిలో ఎవరు విన్నర్..?

NQ Staff - December 1, 2023 / 10:56 AM IST

Bigg Boss Telugu 7 : శివాజీ, యావర్ ఫినాలే రేస్ నుంచి ఔట్.. ఆ ముగ్గురిలో ఎవరు విన్నర్..?

Bigg Boss Telugu 7  :

బిగ్ బాస్ లో ఇప్పుడు అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ నడుస్తోంది. సీజన్-7 మొదలైనప్పటి నుంచి ఇలాంటివే జరుగుతున్నాయి. అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి విన్నర్ రేస్ లో ముగ్గురి పేర్లు బలంగా వినిపించాయి. అందులో శివాజీ అందరికంటే మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఉండేవాడు. తర్వాత స్థానంలో యావర్ కొనసాగాడు. ఓటింగ్ జరిగిన ప్రతిసారి ఈ ముగ్గురే టాప్-3లో ఉండేవారు. వేరే వారికి అవకాశం కూడా ఇవ్వకుండా ఈ ముగ్గురూ ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఫినాలే అస్త్ర మొదలైనప్పటి నుంచి అంతా ఉల్టా పల్టా జరుగుతోంది.

టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన శివాజీకి మొదట్లోనే షాక్ తగిలింది. ఫినాలే అస్త్ర టాస్క్ నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో అతని టైటిల్ ఫేవరెట్ ఆశలు మొత్తం అడియాశలు అయిపోయాయి. అటు ప్రిన్స్ యావర్ పరిస్థితి కూడా అంతే. ఆయన మొదట్లో టాప్ ప్లేస్ లో నిలుస్తాడని అంతా అనుకున్నారు. మొదటి నుంచి టాస్క్ లు ఆడటంలో యావర్ దుమ్ములేపుతున్నాడు. కానీ ఇప్పుడు ఫినాలే అస్త్ర టాస్క్ లలో మాత్రం చేతులెత్తేశాడు. ఇన్ని రోజులు ఆడింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఫినాలే అస్త్ర కోసం ఆడింది మరో ఎత్తు అన్నట్టు ఉంటుంది.

అలాంటిది ఇప్పుడు కీలకమైన సమయంలో యావర్ చేతులెత్తేశాడు. దాంతో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కు ఇది ప్లస్ అయ్యేలా ఉంది. పల్లవి ప్రశాంత్ ఫినాలే అస్త్ర టాస్క్ లలో దుమ్ములేపుతున్నాడు. అందరికంటే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పటివరకు ప్రశాంత్ నాలుగు టాస్క్‌లు గెలిచి 720 పాయింట్లతో అందరికంటే మొదటి స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత రెండో స్థానంలతో అర్జున్ ఉన్నాడు. అతనికి ఏకంగా 710 పాయింట్లు వచ్చాయి. మూడో స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. అతను మూడు టాస్క్ లు గెలిచాడు. అతనికి ఏకంగా 680 పాయంట్లు వచ్చాయి.

వీరిలో అందరికంటే ఎక్కువగా ఫినాలే అస్త్ర టాస్క్ గెలిచే అవకాశాలు పల్లవి ప్రశాంత్ కు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అతను మాత్రమే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. చూస్తుంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

మొన్నటి వరకు అతనికి శివాజీ అడ్డుగా ఉండేవాడు. కానీ ఇప్పుడు శివాజీ రేస్ నుంచి తప్పుకున్నట్టు అయిపోయింది. దాంతో పల్లవి ప్రశాంత్ కు మొదటి స్థానం దక్కేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు రెండో స్థానంలో అమర్ దీప్ ఉండేలా ఉన్నాడు. కానీ శివాజీకి మరో అవకాశం దక్కితే మాత్రం రేస్ లోకి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us