గంగవ్వ హౌస్ లో అవసరమా..? దేవి గేమ్ ప్లాన్ అదేనా..?

Advertisement

హాయ్ వెల్ కమ్ టు స్పెషల్ అప్ డేట్స్. బిగ్ బాస్ షో ఇది ఒక రియాలిటీ షో.. కానీ ఇప్పుడున్న హౌస్ మేట్స్ ఎవరూ కూడా మనం ఒక రియాలిటీ షోకి వచ్చామని అనుకోవడం లేదు. నేను బయట ఎలా ఉంటానో హౌస్ లో కూడా అలాగే ఉంటానని చెప్పేందుకే అందరూ ప్రయత్నిస్తున్నారు. అందరూ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ల ఓరిజినాలిటీస్ బయటకి వచ్చే టైమ్ వచ్చేసింది. రెండు వారాలు గడిచిన ఈ సమయంలో ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా గంగవ్వ హౌస్ లో బంధించినట్లుగా ఉంటోందని ఫీల్ అవుతున్నారు. నిజానికి టాస్క్ లు వచ్చినపుడు గంగవ్వ పెర్ఫామెన్స్ పెద్దగా ఏమీ ఉండటం లేదు. అంతేకాదు, గంగవ్వకి ఎలా ఎంటర్ టైన్ చేయాలో అర్ధం కావడం లేదు. హౌస్ మేట్స్ మంచిగా చూసుకుంటున్నారు కానీ, గంగవ్వకి పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకడం లేదు. ఈ టైమ్ లో గంగవ్వ అసలు ఇంట్లో ఉండటం అనేది ఎంతవరకూ కరెక్ట్ అనేది ఆడియన్స్ చెప్తున్న మాట.


ఇక నెక్ట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఈ వీక్ స్వాతి దీక్షిత్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. స్వాతి దీక్షిత్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న అమ్మాయే. బ్రేక్ అప్ అనే సినిమా ద్వారా తెలుగులోకి వచ్చింది. తర్వాత అల్లరి నరేష్ తో జంప్ జిలానీ అనే సినిమా చేసింది. అయితే.., ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి హౌస్ లో ఉన్న వాళ్లతో ఎలా మింగిల్ అవుతుంది.. అక్కడున్న లేడీస్ గ్యాంగ్ ని ఎలా ఎదుర్కుంటుంది అనేది ఆసక్తికరం. మరి స్వాతి దీక్షిత్ ని ఎలా హౌస్ లోకి పంపిస్తారో చూద్దాం..


మరోవైపు లేడీస్ గ్యాంగ్ లో దేవి ప్లాన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ముక్కుసూటిగానే అన్ని విషయాలు చెప్తోంది కానీ, డిఫరెంట్ స్ట్రాటజీని అప్లై చేస్తోంది. ముఖ్యంగా వర్క్ షేరింగ్ విషయంలో, హౌస్ మేట్స్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటోంది. ఎంటర్ టైన్మెంట్ విషయం పక్కనబెడితే.., మిగతా విషయాల్లో దేవి నాగవల్లి అస్సలు హౌస్ మేట్స్ తో కలవడం లేదు. అంతేకాదు, హౌస్ మేట్స్ కూడా తనతో నాకెందుకొచ్చిందిలే అన్నట్లుగానే ఉన్నారు. నామినేషన్స్ తర్వాత నన్ను అందరూ ఎవైడ్ చేస్తున్నారు అంటూ దేవి నాగవల్లి చెప్పుకొచ్చింది కూడా.


మరోవైపు ఫేక్ ఎలిమినేషన్ చేసి హారికకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ దెబ్బకి హారిక కూడా గేమ్ ప్లాన్ మార్చేస్తుంది. అంతేకాదు, తనకి యాంటీ అయినవాళ్లని ఒక ఆట ఆడుకుంటుంది. ముఖ్యంగా మెహబూబ్ అండ్ సుజాతలు సిల్లీ కారణాలు చెప్తూ హారికని ఎలిమినేట్ చేయడానికి రంగు నీళ్లు పోసారు. ఇక్కడే హారిక బాగా హర్ట్ అయ్యింది కూడా. ఇక బిగ్ బాస్ టీమ్ కూడా హౌస్ మేట్స్ కి ఈ ఎలిమినేషన్స్ తో ఒక వార్నింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు నామినేషన్స్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు వీళ్లు.


అలాగే మిగతా హౌస్ మేట్స్ ఇంకా ఓపెన్ అప్ అవ్వాల్సి ఉంది. వారి నుంచి సరైన కంటెంట్ ఇంకా రాలేదనే చెప్పాలి. అరియానా, అఖిల్, సుజాత, లాస్య, నోయల్, వీళ్లకి ఇంకా స్క్రీన్ స్పేస్ ఇవ్వాల్సి ఉంది. ఇంకా దివి కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతోంది కాబట్టి తన వైపు కూడా కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఇక సోహైల్ అన్నా.. నువ్వెక్కడున్నావ్ అంటూ ఆడియన్స్ అడుగుతున్నారు. మంచి టాలెంట్ ఉన్నా, చేసే సత్తా ఉన్నా కూడా సేఫ్ జోన్ లో ఉంటూ గేమ్ ఆడుతున్నాడు సోహైల్. సోహైల్ నుంచి కూడా ఫుల్ కంటెంట్ ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
మరిచూద్దాం.. థర్డ్ వీక్ ఏం జరగబోతోంది అనేది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here