బిగ్ బాస్ సీజన్ – 4 – సీక్రట్ పాయింట్స్… Paritala Murthy Exclusive

Advertisement

ఈ 6గురి గురించి చెప్పేశారా..?
వాళ్ల క్యారెక్టర్స్ ఇవేనా..?

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ స్పెషల్ అప్ డేట్స్…
బిగ్ బాస్ సీజన్ – 4 చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది . ఈ స్టేజ్ పైన మా టీవి లోగోని సైతం మార్చి తెలుగులో పెట్టారు కూడా. అంతేకాదు, ఈసారి పార్టిసిపెంట్స్ ని చూస్తే చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా ఉన్నారు. గంగవ్వ, సూర్యకిరణ్, అమ్మరాజశేఖర్ ఈ ముగ్గురే హౌస్ లో కాస్త పెద్దగా కనిపిస్తున్నారు తప్ప, మిగతా వారందరూ కూడా సై అంటే సై అనేలాగానే ఉన్నారు.
ఇక ఫస్ట్ డేనే బిగ్ బాస్ హౌస్ లో 16మంది పార్టిసిపెంట్స్ ని 8 జంటలుగా విడగొట్టాడు బిగ్ బాస్. ఇందులో ఇద్దరిని సీక్రట్ రూమ్ లో ఉంచితే మిగతా ఆరుగురుని నెంబరింగ్ గేమ్ ద్వారా జంటలుగా చేశాడు. ఇందులో నోయల్ అండ్ గంగవ్వ మిగిలిన ఇద్దరూ అయితే, ఆరుగురి మనస్తత్వాలని బోర్డ్ పై రాసి వారిని జంటలుగా చేశారు.
ఇందులో మనం క్లీన్ గా అబ్జర్వ్ చేసినట్లయితే.., పార్టిసిపెంట్స్ మనస్తత్వాలు ఎలా ఉంటాయో హౌస్ మేట్స్ కి ముందుగానే చెప్పే ప్రయత్నం చేశారనే చెప్పాలి.
నెంబర్స్ గేమ్ ఆడిన ఆరుజంటలని మనం ఒక్కసారి చూసినట్లయితే ప్రాపర్టీ కనక్షన్స్ ఇస్తూ హౌస్ లోకి వచ్చిన వారిని జంటలుగా చేశారు. సూర్య కిరణ్ – దేవి నాగవల్లి ఇద్దరూ ఒక జంటగా కనెక్ట్ అయ్యారు. ఇక్కడ దేవి నాగవల్లి నమ్మకస్తురాలు, స్ట్రిక్ట్ , గజిబిజి అని నెంబర్ ప్లేట్ పై రాసి ఉంది.
ఇలాగే లాస్య తో పెయిర్ అయిన మెహబూబ్ దిల్ సే షాపింగ్ పిచ్చి, దూకుడు స్వభావం, ఫిట్ అని చెప్పారు.


ఇక మోనాల్ తో జతకట్టిన జోర్ధార్ సుజాత టిఫిన్స్ తినదు, అతిజాగ్రత్తపరురాలు, అలాగే వాగుడు కాయ అని రాసారు.
అభిజిత్ తో కనెక్ట్ అయిన దేత్తడి హారిక సర్ధుకుపోయే మనస్తత్వం, తిండిపోతూ, ఓసీడీ అని చెప్పేశారు.
అలాగే లాస్ట్ లో వచ్చిన అమ్మరాజశేఖర్ తో కనెక్ట్ అయిన దివి వైద్య కి డ్రామాలు ఎక్కువ, రొమాంటింక్, మతిమరుపు అని ఉంది.
కరాటే కళ్యాణికి కనెక్ట్ అయిన అఖిల్ సార్థక్ కోపిష్టి, జలస్, అందమైనవారు అని చెప్పకనే చెప్పాడు బిగ్ బాస్. అంతేకాదు, అరియానా గ్లోరీతో సయ్యద్ ఎలాంటి వాడో ఫేస్ రీడింగ్ ద్వారా కూడా చెప్పించే ప్రయత్నం చేశారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ లో ఈ ఆరుగురి మనస్తత్వాలని ఆడియన్స్ కి ముందుగానే పరిచయం చేశారన్నమాట.
అంతేకాదు, గంగవ్వ ని తీస్కుని రావడం వెనక కూడా ఒక హ్యూమానిటీ యాంగిల్ ఉంది. ఈసారి మొదట్లోనే ఇద్దరినీ సీక్రట్ రూమ్ లో ఉంచి ఓటింగ్ చేయమని చెప్తారు.
అంతేకాదు, ఇలా 8 జంటలని నామినేషన్స్ కోసమే చేశారని కూడా తెలుస్తోంది. నామినేషన్స్ లో ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఏకాభిప్రాయంతో మరో ఇద్దరిని నామినేట్ చేస్తారన్నమాట. అత్యధికంగా ఓట్లు వచ్చిన వారు ఎలిమినేషన్స్ లోకి వస్తారు. ఇలా ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయ్యేవారు నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. హౌస్ లోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం నిజంగా బాధాకరం. ఇక నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా సోమవారం ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ గా ఉంటుందనే అనిపిస్తోంది.
మరి చూద్దాం.. ఈసారి నామినేషన్స్ లోకి ఎంతమంది వస్తారు అనేది…
ఎప్పటికప్పుడు బిగ్బాస్ అప్ డేట్స్ కోసం.. ఇంట్రస్టింగ్ పాయింట్స్ కోసం చూస్తునే ఉండండి..

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here