బిగ్ బాస్ సీజన్ – 4.. ఓపెనింగ్ డే రివ్యూ Paritala Murthy Exclusive

Advertisement

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ అప్ డేట్స్..
ప్రతిరోజు మీకోసం నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో అనేది హైలెట్స్ రూపంలో చెప్పడానికి నేను మీముందుకు వచ్చాను..
సండే రోడు బిగ్ బాస్ సీజన్ 4 స్టేజ్ దద్దరిల్లిపోయింది… నాగార్జున డెడ్లీగా మెడ్లీ చేస్తుంటే ఆడియన్స్ కి మెంటలెక్కిపోయింది. ముఖ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ , ఆ ఎనర్జీ అన్నీ కూడా నాగ్ వయసుని అస్సలు గుర్తు చేయడం లేదు. ఇక డ్యాన్స్ పెర్ఫామెన్స్ తోనే కాకుండా నాన్న గెటప్ ని వేసి ముసలోడిగా కామన్ ఆడియన్ గా నాగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇదైతే సింప్లీ సూపర్బ్… బిగ్ బాస్ హౌస్ ని ఈ గెటప్ తోనే ఆడియన్స్ కి పరిచయం చేశాడు. అంతేకాదు, పంచ్ లు ప్రాసలతో యాంకరింగ్ ఇరగదీశాడు. ఈసారి ఫ్లోర్ లో ఆడియన్స్ లేరు… ఎందుకంటే కోవిడ్ నిబంధనలని అనుసరించి షో చేస్తున్నట్లుగా ఒక గట్టి మెసేజ్ ని పంపించారు. అంతేకాదు, బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ని కూడా 15రోజులపాటుగా క్వారైంటైన్ లో పెట్టామని , వారికి కరోనా టెస్ట్ చేశాకే హౌస్ లోకి పంపించామని నాగ్ చెప్పడం, బిగ్ బాస్ కెమెరా టీమ్ ని, అలాగే పనిచేసే క్రూని కూడా పిపి కిట్స్ లో చూపించడం అనేది అందరిలో ఉన్న భయాలని పొగొట్టింది.
ఇక ఇదే స్టేజ్ పైన స్టార్ మా సరికొత్త లోగోని లాంఛ్ చేశారు. మా టీవి మోర్ ఎంటర్ టైన్మెంట్ ఇకనుంచి ఇస్తుందని, కొత్త కొత్త సీరియల్స్ తో ముందుకు వస్తోందని లోగోని లాంఛ్ చేశారు. దీని తర్వాత ఊహించినట్లుగానే హౌస్ మేట్స్ 16 మంది ఒక్కొక్కరుగా హౌస్ లోకి వచ్చారు. ఫస్ట్ పార్టిసిపెంట్ గా హీరోయిన్ మోనాల్ గజ్జర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బ్యూటిఫుల్ పెర్ఫామెన్స్ తో ఇరగదీసింది ఈ గుజరాతీ అమ్మాయి. తెలుగు అంతగా రాకపోయినా అర్ధం చేస్కోగలను అని, తనని తాను ప్రూవ్ చేస్కుంటానికే షోకి వచ్చానని చెప్పింది. అంతేకాదు, తన చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను అని, అప్పట్నుంచి లైఫ్ లో పోరాడుతూనే ఉన్నానని చెప్పింది ఈ అమ్మడు.
నెక్ట్స్ సెకండ్ పార్టిసిపెంట్ గా డైరెక్టర్ సూర్య కిరణ్ తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత యాంకర్ లాస్య తన చిన్నబాబుని వదిలేసి మరీ బిగ్ బాస్ కి వచ్చానని ఇక్కడ మదర్ గా, కంటెంస్టెంట్ గా తనేంటో ప్రజలకి అర్ధమయ్యేలా చూపించాలనే ప్రయత్నం అని చెప్పింది. అంతేకాదు, స్ట్రాంగ్ ఎవి తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది లాస్య.


ఆ తర్వాత హీరో అభిజిత్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో వచ్చాడు. చిన్న ఫన్ కూడా చేశాడు. ఈ నలుగురు హౌస్ లోకి వెళ్లగానే వీరితో చిన్నగేమ్ ఆడించాడు నాగ్. ఈ నలుగురిని గార్డెన్ ఏరియాలో ఉన్న ఆరు బాక్స్ లలో నాలుగు బాక్స్ లు తీస్కోమని చెప్పాడు. ఆనెంబర్స్ పైన హౌస్ లోకి రాబోతున్న వారి యాటిట్యూట్ ఎలా ఉంటుందో చదువుకుని ఎంచుకోమని వారితో చిన్న కనెక్షన్ కూడా ఉంటుందని చెప్పాడు. దీంతో ఈ నలుగురు హౌస్ మేట్స్ ఆచితూచి నెంబర్స్ ఎంచుకున్నారు. వీళ్లు ఎంచుకున్న నెంబర్స్ ప్రకారం తర్వాత పార్టిసిపెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.
జోర్దార్ సుజాత, మెహబూబ్ దిల్ సే, దేవి నాగవల్లి, దేత్తడి హారికలు వరుసగా ఎంట్రీ ఇచ్చారు. స్టేజ్ పైన నాగ్ వీరికి గిఫ్ట్ బాక్స్ ఇచ్చి హౌస్ లోకి వెళ్లాక ఓపెన్ చేయమని చెప్పాడు. ఈ నలుగురు హౌస్ లో ఉన్న నలుగురికి ఎటాచ్ అవుతారని చెప్పాడు. దీంతో సుజాత – మోనాల్ , మెహబూర్ దిల్ సే – లాస్య , సూర్యకిరణ్ – దేవి నాగవల్లి , దేత్తడి హారిక – అభిజిత్ వీళ్లు ప్రాపర్టీస్ మ్యాచ్ చేస్కుని కనక్ట్ అయ్యారు.
ఇక 9వ పార్టిసిపెంట్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఆర్టిస్ట్ సొహైల్ రియాన్ , సొహైల్ రియాన్ ఎంట్రీ ఇవ్వగానే హౌస్ లోకి వెళ్లకుండా పక్కన ఉండని చెప్పాడు నాగ్. తర్వాత 10 కంటెస్టెంట్ గా నేను బోల్డ్ అంటూ వచ్చింది అరియానా గ్లోరీ. దీంతో వీరిద్దరిని జోడిగా చేసి సీక్రట్ రూమ్ కి పంపించి ఓపెనింగ్ రోజే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.
11వ పార్టిసిపెంట్ గా వచ్చిన అమ్మరాజశేఖర్ తనదైన స్టైల్లో స్టేజ్ పైన స్టెప్పులతో రెచ్చిపోయాడు. నేను నా శిష్యడు అయిన బాబాభాస్కర్ దగ్గర టిప్స్ తీస్కుని వచ్చానని చెప్పాడు. అంతేకాదు, స్టేజ్ పైన తన భార్యతో వీడియోకాల్ లో కాసేపు మాట్లాడి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత కరాటే కళ్యాణి ఒక బ్యూటిఫుల్ ఇన్సిపిరేషన్ ఎవితో ఎంట్రీ ఇచ్చింది. నాగ్ ముందు కాసేపు హరికథ స్టైల్లో పాట పాడి అలరించింది. వీరిద్దరూ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ర్యాంప్ పాడుతూ రెచ్చిపోయి మరీ ఎంట్రీ ఇచ్చాడు సింగర్ నోయల్. బిగ్ బాస్ పైన ఒక ర్యాంప్ పాడి ఇరగదీశాడు.
నాగ్ తో పాటు ఆడియన్స్ కూడా మనోడి ర్యాంప్ కి ఇంప్రెస్ అయిపోయారు. ఈ ముగ్గురు హౌస్ లోకి వెళ్లిన తర్వాత మిగిలిన రెండు బాక్స్ లలో ఇద్దరినీ తీస్కోమని చెప్పాడు బిగ్ బాస్. కరాటే కళ్యాణి, అమ్మరాజశేఖర్ రెండు బాక్స్ లు తీస్కున్నారు. సింగర్ నోయల్ మాత్రం ఏదీ తీస్కోలేదు. బోర్డ్ పైన నెంబర్స్ చదువుతూ ఉండిపోయాడు.
ఇక తర్వాత వచ్చి పార్టిసిపెంట్స్ దివి వైద్య , అఖిల్ సార్ధక్ ఇద్దరూ కూడా స్టేజ్ పైన పెర్ఫామెన్స్ ఇరగదీసారు. దివి తన గ్లామర్ తో రెచ్చిపోయింది. అఖిల్ తన ఫిట్ నెస్ ని చూపించాడు. వీరిద్దరూ హౌస్ లోకి వచ్చాక దివి అమ్మరాజశేఖర్ ప్రాపర్టీతో కనెక్ట్ అయితే, అఖిల్ కరాటే కళ్యాణీ తీస్కున్న బాక్స్ కి మ్యాచ్ అయ్యాడు. ఇక లాస్ట్ లో వచ్చినా లేటెస్ట్ గా వచ్చింది గంగవ్వ. జిగేల్ మనే చీర కట్టుకుని తనదైన స్టైల్లో ఎవితో అలరించింది. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ లోనే స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. గంగవ్వని మిగిలిని నోయల్ కి ఎటాచ్ చేసి మొత్తం 16 మందిని 8 జోడీలుగా విభజించాడు బిగ్ బాస్.
మద్య మద్యలో వచ్చిన నాగ్ ఓల్డ్ గెటప్ ఆడియన్స్ కి కేక పుట్టిస్తే…, పార్టిసిపెంట్స్ లో దేత్తడి హారిక, అరియానా, దివి, మోనాల్ తమ గ్లామర్ తో కిక్ ఇచ్చారనే చెప్పాలి. ఇవి ఓపెనింగ్ డే హైలెట్స్..
ఫస్ట్ డే హైలెట్స్ లో రేపు కలుద్దాం.. థ్యాంక్యూ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here