బిగ్ బాస్ చూపించేది నిజమేనా?

Admin - September 22, 2020 / 11:24 AM IST

బిగ్ బాస్ చూపించేది నిజమేనా?

బిగ్ బాస్… ప్రపంచంలోనే అతి పెద్ద షో… ఇది మనం వినే మాట… అందరూ అనుకునే మాట. అయితే అసలు నిజమేంటి.? బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కు మాత్రమే తెలుస్తుంది. రీసెంట్ గా బిగ్ బాస్ గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. అది చెప్పింది ఎవరో కాదు లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ వితిక షేరు.

లాస్ట్ సీజన్ తన భర్త వరుణ్ సందేశ్ తో కలిసి హౌస్ లోకి ఎంటర్ అయ్యి టాప్ సెవెన్ లో ఒకరిగా నిలిచిన వితిక షేరు బిగ్ బాస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీ గా ఉన్నానని.. అక్కడి నుండి ఎలిమినేట్ అయ్యాక కూడా ఎంతో హ్యాపీ గా బయటకు వచ్చానని.. తాను చాలా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అని అనుకునేదట.

అయితే ఆ తరువాత జనాలు తనతో బిహేవ్ చేసే పద్దతే పూర్తిగా మారిపోయిందంట. తన గురించి పూర్తిగా తెలిసిన ఫ్రెండ్స్ కూడా తనను దూరం పెట్టారట. ఇదేంటి అని ఆలోచించగా తన పాత బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన వితిక షాక్ అయ్యింది. తాను మాట్లాడిన విషయం ఎడిట్ చేసి మరొక చోట పెట్టేసరికి ఆ మాట మీనింగ్ పూర్తిగా మారింది అని చెప్పింది.
అసలు బిగ్ బాస్ అనేది 24 గంటల షో. అందులో వారు చూపించేది కేవలం గంట మాత్రమే.

ఆ గంట వారికి నచ్చింది మాత్రమే చూపిస్తారు. మిగతా 23 గంటలు ఏమైంది. అంటే వారు చూపించే గంట ఎపిసోడ్ చూసి ఒక మనిషి క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తారా అని అడిగింది. తాను ఫేస్ చేసిన డిప్రెషన్ ఎవ్వరికీ రాకూడదు అన్న ఉద్దేశంతోనే తాను బిగ్ బాస్ గురించి ఇలా మాట్లాడానని చెప్పింది. ఆ డ్రెప్రెషన్ నుండి బయటకు వచ్చాక ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అన్న విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది వితిక షేరుకు..

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us