Bigg Boss Plan On Pallavi Prashant : రైతుబిడ్డను కావాలనే లేపుతున్న బిగ్ బాస్.. పెద్ద ప్లానే వేశాడుగా..!

NQ Staff - September 13, 2023 / 10:26 AM IST

Bigg Boss Plan On Pallavi Prashant : రైతుబిడ్డను కావాలనే లేపుతున్న బిగ్ బాస్.. పెద్ద ప్లానే వేశాడుగా..!

Bigg Boss Plan On Pallavi Prashant : బిగ్ బాస్ సీజన్-7 ఊహకు మించి ఉంటుందని మొదటి నుంచి నాగార్జున చెబుతూనే ఉన్నాడు. అందుకే ఈ సారి ఉల్టా పల్టా అనే కాన్సెప్టును తీసుకువచ్చారు. అయితే ఈ సారి హౌస్ లోకి ఒక రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను తీసుకువచ్చారు. గత బిగ్ బాస్ సీజన్ లో ఎప్పుడూ ఇలా రైతుబిడ్డను తీసుకురాలేదు. అయితే మనోడు వచ్చినప్పటి నుంచి రతిక రోజ్ తో లవ్ ట్రాక్ ను సాగిస్తున్నాడు. ఇదంతా బిగ్ బాస్ ప్లాన్ లో భాగంగానే సాగుతున్నట్టు అందరికీ తెలిసిందే. ఎందుకంటే వచ్చిన రెండు రోజులకే ఎవరి మధ్య లవ్ అనేది పుట్టదు కదా. అదంతా స్క్రిప్ట్ లో భాగంగానే జరుగుతుంది.

గత సీజన్లలో కూడా ఇలా ఎన్నో ప్రేమ కథలు పుట్టాయి. కానీ అందులో ఒక్కటి కూడా బయటకు వచ్చాక కంటిన్యూ కాలేదు. ఇప్పుడు ఇది కూడా అంతే అనుకోండి. అయితే మొదటి వారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అప్పుడు అందరికంటే మనోడికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఏకంగా 40 శాతం ఓట్లు ఈ ఒక్కడికే వచ్చాయంటే మనోడి స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు రెండో వారం నామినేషన్స్ టాస్క్ లో ఓ తీవ్రమైన ఘటన జరిగింది. హౌస్ లోని కంటెస్టెంట్లు అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేశారు. ఈ వారం ఎనిమిది అతన్ని నామినేట్ చేశారు.

అందరికంటే ఎక్కువ మంది నామినేట్ చేసిన వ్యక్తిగా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ ను ఇలా చేయడం వల్ల అతనికే సింపతీ క్రియేట్ అవుతోంది. కాగా ఇదంతా బిగ్ బాస్ ప్లానింగ్ లో భాగంగానే జరిగినట్టు తెలుస్తోంది. ఒక సామాన్య రైతు బిడ్డను టార్గెట్ చేస్తే కచ్చితంగా బిగ్ బాస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్లపై నెటిజన్లు విరుచుకుపడుతారు. అప్పుడు అందరూ బిగ్ బాస్ ను ఒక సామాన్య వ్యక్తి కోసం అయినా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. పైగా ఓట్లు వేయడానికి కూడా ఇంట్రెస్ట్ పెడుతారు. ఆటో మేటిక్ గా ఈ షోకు రేటింగ్ పెరిగిపోతుంది.

మన సొసైటీలో బాధింపబడ్డ వ్యక్తి మీద చూపించే జాలి అంతా ఇంతా కాదు. అతని కోసం ఏదైనా చేయాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక రైతుబిడ్డగా హౌస్ లోకి వచ్చాడు. పైగా సామాన్య వ్యక్తి.. కాబట్టి అతన్ని టార్గెట్ చేసేలా చూస్తే కచ్చితంగా తమకు కలిసి వస్తుందని బిగ్ బాస్ మేనేజ్ మెంట్ ప్లాన్ అని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల బిగ్ బాస్ గురించి అంతటా చర్చ జరుగుతుంది.

దాంతో బిగ్ బాస్ మీద అందరి ఫోకస్ ఏర్పడుతుంది. కాబట్టి వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు బిగ్ బాస్ మీద నెగెటివ్ కామెంట్లు రావట్లేదు. అందులో ఉన్న కంటెస్టెంట్ల గురించే చర్చ జరుగుతోంది. దాంతో ఇప్పుడు బిగ్ బాస్ ను చూసేందుకు, ఓట్లు వేసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. మొత్తంగా బిగ్ బాస్ వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందన్నమాట.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us