Bigg Boss Nominations : రైతు బిడ్డను టార్గెట్ చేసిన హౌస్.. కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్..!

NQ Staff - September 12, 2023 / 10:49 AM IST

Bigg Boss Nominations : రైతు బిడ్డను టార్గెట్ చేసిన హౌస్.. కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్..!

Bigg Boss Nominations : బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకూ రచ్చ రచ్చగా మారుతోంది. ఇక నిన్న సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ మామూలుగా జరగలేదు. అయితే ఇదంతా బిగ్ బాస్ దగ్గరుండి మరీ చేయించాడు. కంటెస్టెంట్ల మధ్య కావాలనే గొడవలు పెట్టి వారి మధ్య మంట పెట్టాడు. మొదట ఆట సందీప్ తో ఆట ఆడించి గొడవ మొదలు పెట్టాడు. తర్వాత ఒక్కొక్కరినీ అందులోకి లాగి అందరినీ గొడవ పడేలా చేశాడు. నామినేషన్స్ ను కాస్త వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. పవర్ అస్త్రా సాధించిన ఆట సందీప్ కు నేరుగా ఒకరిని నామినేట్ చేసేందుకు అవకాశం ఇచ్చాడు. దాంతో అతను ఎవరిని చేస్తాడా అని అంతా టెన్షన్ పడ్డారు.

సందీప్ ప్రిన్స్ యావర్ ను నామినేట్ చేశాడు. దాంతో ఆ ఇద్దరి నడుగ గొడవ జరిగింది. తన మీద ఇసుక పోసినందుకే చేశానని చెప్పాడు సందీప్. కావాలనే తనను టార్గెట్ చేశాడని యావర్ రెచ్చిపోయాడు. కాగా యావర్ ను మిగతా కంటెస్టెంట్లు నామినేట్ చేసేందుకు అవకాశం లేదని చెప్పాడు బిగ్ బాస్. దాంతో వారు సైలెంట్ అయ్యారు. ఇక టేస్టీ తేజను శుభ శ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశారు. వర్క్ చేయట్లేదని శుభ శ్రీ చెప్పింది. నువ్వు కొంచెం యాక్టివ్ గా ఉండు అని రతిక చెప్పింది. కిండ పడుకోవడం గురించి పల్లవి ప్రశాంత్ చెప్పాడు. దాంతో వీరి నడుమ కాసేపు గొడవ జరిగింది.

అయితే తాను ఎప్పుడూ పడుకోలేదని పని చేశానని తేజ చెప్పాడు. అంతే కాకుండా తనను తిని తొంగుంటున్నావ్ అని ఎందుకు అంటున్నారని మండి పడ్డాడు. ఇక అమర్ దీప్ వచ్చి. శివాజీ మీద ఫైర్ అయ్యాడు. ఏదైనా ఉంటే తనను పల్లవి ప్రశాంత్ తో ఎందుకు పోలుస్తున్నారని అడిగాడు. పల్లవి ప్రశాంత్ వేటాడటానికి వస్తే నేనేమైనా పేకాట ఆడటానికి వచ్చానా అంటూ అరిచేశాడు. తర్వాత ప్రియాంక, శోభా శెట్టి, షకిలా కూడా వచ్చి నామినేట్ చేశారు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలంటూ శివాజీ మీద ప్రియాంక ఫైర్ అయింది.

ఇక చివరగా అసలు రచ్చ మొదలైంది. పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేయడానికి ఎవరు వస్తారు అని బిగ్ బాస్ అడగ్గా.. హౌస్ మొత్తం టార్గెట్ చేసింది. అందరూ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేసేందుకు ఎగబడ్డారు. గౌతమ్ కృష్ణ వచ్చి నామినేట్ చేయగా పల్లవి ప్రశాంత్ సీరియస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత అమర్ దీప్ వచ్చి రైతు బిడ్డ అంటున్నావ్.. నువ్వు నిజమైనా రైతు బిడ్డవా అంటూ దారుణంగా మాట్లాడాడు. రైతు బిడ్డగా బిగ్ బస్ లోకి రావాలనుకున్న నువ్వు… ఇప్పుడు పుష్ప మేనరిజాన్ని చేస్తున్నావ్. ఇదే బాడీ లాంగ్వేజ్ తో వీడియోలు ఎందుకు అడగలేదు అని అన్నాడు.

నువ్వు అలా అడిగి ఉంటే ఎవరూ నిన్ను పట్టించుకునే వారు కాదని ఫైర్ అయ్యాడు. అంతే కాకుండా రైతు బిడ్డ రైతు బిడ్డ అని సెంటిమెంట్ డైలాగ్ కొట్టకు అంటూ సీరియస్ అయ్యాడు. ఈ క్రమంలో అమర్ దీప్ కు పల్లవి ప్రశాంత్ కు మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. ఇద్దరూ కాసేపు అరుచుకున్నారు. ప్రశాంత్ కూడా అమర్ దీప్‍కు గట్టి సమాధానం ఇచ్చాడు. తొడలు కొట్టాడు.., మీసాలు మేలేసి చెప్పాడు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ ను ఎక్కువ మంది నామినేట్ చేశారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us