Bigg Boss Nominations : బిగ్ బాస్ నామినేషన్స్ లో 9 మంది.. ఇదే ఫస్ట్ టైమ్ అంట..!

NQ Staff - September 13, 2023 / 09:39 AM IST

Bigg Boss Nominations : బిగ్ బాస్ నామినేషన్స్ లో 9 మంది.. ఇదే ఫస్ట్ టైమ్ అంట..!

Bigg Boss Nominations : బిగ్ బాస్ లో సరికొత్తగా టాస్కులు సాగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి వెరైటీగా నామినేషన్లు, ఎలిమినేషన్లను ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. అయితే రెండో వారంలో నామినేషన్స్ కూడా రచ్చ రచ్చగా సాగింది. సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం దాకా కొనసాగింది. 11వ ఎపిసోడ్‍లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అతనికి మొత్తంగా 8 మంది ఓట్ చేసి నామినేట్ చేశారు. ఇక మంగళవారం మాత్రం ముగ్గురు కంటెస్టెంట్ల మధ్య జోరుగా వార్ నడిచింది. చివరకు 9మంది నామినేట్ అయ్యారు.

ఇందులో అత్యధిక మంది నామినేట్ చేసిన పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, శోభా శెట్టి, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, షకీల, టేస్టీ తేజ, అమర్ దీప్ చౌదరితోపాటు పవర్ అస్త్ర సాధించిన ఆట సందీప్ నేరుగా ప్రిన్స్ యావర్ ను నామినేట్ చేశాడు. మొత్తంగా హౌస్ నుంచి బయటకు వెళ్లే వారిలో తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో ప్రేక్షకుల నుంచి ఎవరికీ తక్కువ ఓట్లు నమోదు అయితే వారు హౌజ్‍ను వీడాల్సి ఉంటుంది. గతంలో ఎన్నడూ జరగని విధంగా నామినేషన్స్ జరిగాయి. ఓ కంటెస్టెంట్ ను పిట్ లో నిల్చోబెట్టి మిగతా వారందరూ కలిసి నామినేట్ చేయడం ఇదే మొదటిసారి.

ఇక పల్లవి ప్రశాంత్ ను హౌస్ లోకి కంటెస్టెంట్లు మొత్తం టార్గెట్ చేశారు. ఇలాంటి ఘటన బిగ్ బాస్ చరిత్రలో జరగలేదు. ఇక నామినేషన్స్ తర్వాత హౌస్ కంటెస్టెంట్లు అందరూ వచ్చి ఓదార్చడం విశేషం. ఇక మంగళవారం నుంచి ఓటింగ్ పోల్ మొదలు కాబోతోంది. అయితే సోషల్ మీడియాలో ఈ నామినేషన్స్ మీద పెద్ద రచ్చే జరుగుతోంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ను అందరూ కలిసి టార్గెట్ చేయడాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక సామాన్య వక్తి బిగ్ బాస్ లోకి వస్తే తప్పా.. ఇలా అందరూ కలిసి అతన్ని టార్గెట్ చేస్తారా.. మీరు యాక్టర్స్ అయితే ఇలా ఒక రైతుబిడ్డను టార్గెట్ ఎందుకు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.

ఒక రకంగా పల్లవి ప్రశాంత్ కు మంచి సింపతీ వచ్చేసింది. ప్రస్తుతం అతనికి మద్దతు బాగా పెరిగిపోయింది. మొదటివారం నామినేషన్స్ లో కూడా ప్రశాంత్ ఉన్నాడు. అప్పుడు అతనికి అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎంతలా అంటే ఏకంగా 40 శాతం ఓటింగ్ ఆ ఒక్కడికి మాత్రమే వచ్చాయి.

ఇప్పుడు మరింత సింపతీ పెరిగిపోయింది కాబట్టి కచ్చితంగా మళ్లీ పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉంటాడని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us