బిగ్ బాస్ : గంగవ్వను అందరూ అవసరానికి వాడుకుంటున్నారా?

Advertisement

గంగవ్వ 60 ఏళ్ళ వయసులో అనుకోకుండా సెలబ్రిటీ అయ్యింది. ఆమె అంటే అందరికీ ఎంతో ఇష్టం. కల్లాకపటం లేని ఆమె మాటలు వింటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అందుకే ఆమెకు అంత క్రేజ్. ఆ క్రేజే తనను ఈ వయసులో బిగ్ బాస్ వరకు తీసుకెళ్లింది. బిగ్ బాస్ హౌస్ లో కూడా అందరికీ ఆమె అంటే ఇష్టం. ఏ విషయం జరిగినా ప్రతీ ఒక్కరూ ఆమెనే సపోర్ట్ చేస్తారు. రెండు వారాల్లో రెండు సార్లు నామినేట్ అయిన గంగవ్వను ప్రేక్షకులు తమ ప్రేమతో ఇంట్లో నిలబెట్టారు.

అయితే హౌస్ మేట్స్ గంగవ్వను అవసరానికి వాడుకుంటున్నారా? పావులా ఉపయోగిస్తున్నారా? అంటే మాత్రం.. ఒక్కో సారి నిజమేమో అనిపిస్తుంది. శనివారం జరిగిన హీరో అండ్ జీరో టాస్క్ లో ఎక్కువ మంది.. అమ్మ రాజశేఖర్ ను, గంగవ్వను సెలెక్ట్ చేశారు. ఆఖరికి నాగార్జున కూడా ఆమెకు నచ్చినట్టు చేస్తున్నారు. మామూలుగా నిజంగానే అందరూ ఆమెను ప్రేమగా చూసుకుంటారు. కానీ కొన్ని సార్లు మాత్రం.. అదేదో ప్రేక్షకుల మెప్పు కోసం చేసినట్టు ఉంటుంది.

అమ్మ రాజశేఖర్ విషయం లో కూడా అవ్వ తీర్పే ఫైనల్ అన్నట్టు అనిపించింది. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నారు. హౌస్ మేట్స్, ఆడియెన్స్ సింపతీ కోసమా? బిగ్ బాస్ రేటింగ్స్ కోసమా? ఆమె దగ్గర మంచిగా ఉంటె ప్రజలు గెలిపిస్తారు అన్న ఆశా? అసలు ఈ వయసులో ఉన్న గంగవ్వను ఇంకా ఎంతకాలం ఆ హౌస్ లో ఇబ్బంది పెడతారు. ఒక సారి ఆమె హెల్త్ అప్సెట్ అయినా కూడా ఇంకా తన మీద జాలి లేదా? అంటే కేవలం వీరి అవసరాలకు మాత్రమే గంగవ్వను వాడుకుంటున్నారా..!

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here