Bigg Boss Faima : ఆస్పత్రి బెడ్డుపై బిగ్ బాస్ ఫైమా.. తీవ్ర అనారోగ్యం..!

NQ Staff - November 26, 2023 / 09:40 AM IST

Bigg Boss Faima : ఆస్పత్రి బెడ్డుపై బిగ్ బాస్ ఫైమా.. తీవ్ర అనారోగ్యం..!

Bigg Boss Faima :

ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా ఆస్పత్రి పాలు అవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆస్పత్రిలో జాయిన్ అవుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇక తాజాగా ఫైమా కూడా ఆస్పత్రి పాలు అయిపోయింది. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఎన్నో షోలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.

ముఖ్యంగా పటాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా మంచి ఇమేజ్ ను పొందింది. ఇక బిగ్ బాస్ తో ఆమె ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బిగ్ బాస్ తో ఏకంగా సొంతంగా ఇల్లు కూడా కట్టుకుంది ఫైమా. అప్పటి నుంచి ఆమెకు వరుసగా ప్రోగ్రామ్స్ ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఫైమా కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె ఆస్పత్రి బెడ్డు మీద అచేతనంగా పడి ఉన్నది. చేతికి సెలైన్ కూడా ఉంది. నా గతమంతా నే మరిచానే అనే పాటను ఈ వీడియోకు జోడించి పోస్టు చేసింది ఫైమా. కానీ ఆమెకు అసలు ఏమైందో మాత్రం చెప్పలేదు.

దాంతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె నిజంగానే హాస్పిటలైజ్ అయిందా.. అసలు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనేది మాత్రం ఆమె చెప్పలేదు. కానీ వీడియో చూసిన వారు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us