Bigg Boss Elimination This Week : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే.. టాప్ లో ఆ కంటెస్టెంట్..?
NQ Staff - September 17, 2023 / 12:24 PM IST

Bigg Boss Elimination This Week :
బిగ్ బాస్ సీజన్-7స్టార్ట్ అయి రెండు వారాలు ముగిసింది. కానీ ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగుతోంది. ఈ షోకు వస్తున్న రేటింగ్సే ఇందుకు ప్రధాన ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. ఇక శనివారం రోజున నాగార్జున మళ్లీ వచ్చారు. వస్తూనే తప్పులు చేసిన వారికి క్లాస్ తీసుకున్నాడు. పవర్ అస్త్రాను గెలుచుకున్నది శివాజీ అని ప్రకటించేశాడు. ఆ వెంటనే శివాజీ ఓవర్ యాక్షన్ మీద నిప్పులు చెరిగాడు నాగార్జున. ఇలాంటిది రిపీట్ కావొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతే కాకుండా ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ గొడవ మీద కూడా స్పందించాడు నాగ్.
గౌతమ్ కృష్ణ చేసిన ఇంజెక్షన్ కామెంట్లపై సీరియస్ అయ్యాడు. వెంటనే గౌతమ్ కృష్ణ షర్టు విప్పించాడు. నువ్వు కూడా ఇంజెక్షన్ వేసుకుంటేనే నీకు ఈ బాడీ వచ్చిందా అంటూ కౌంటర్ వేశాడు. దాంతో గౌతమ్ కృష్ణ కూడా సారీ చెప్పాడు. ప్రిన్స్ ను ధైర్యంగా ఉండాలంటూ నాగార్జున నచ్చ జెప్పాడు. ఇక హౌస్ లో మొదట పవర్ అస్త్రను సంపాదించుకున్న ఆట సందీప్ కన్ఫర్మ్ అయిపోయాడు. ఇప్పుడు రెండో మాయాస్త్రను గెలుచుకున్న శివాజీ కూడా పర్మినెంట్ హౌస్ మేట్ అయిపోయాడు. దాంతో ఈ వారం ఎలిమినేషన్స్ లో ఎవరు ఉంటారనే చర్చ మొదలైంది.
రెండో వారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. అయితే ఇందులో శివాజీ పవర్ అస్త్రా సాధించి.. సేఫ్ అయ్యాడు. ఇక మిగిలిన వారిలో షకీలాను ఎలిమినేట్ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఎందుకంటే ఆమెకు ఓటింగ్ లో చాలా తక్కువ వస్తున్నాయి. వాస్తవానికి షకీలా మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందరితో మంచి కంటెస్టెంట్ అనిపించుకుంటుంది. ఎవరికైనా గొడవలు వస్తే కలిపే ప్రయత్నం చేస్తోంది. అందరితో కలిసిమెలిసి ఉంటుంది.
ఈ విషయాన్ని నాగార్జున కూడా చెప్పాడు. చాలా మంచి పని చేస్తున్నావ్ షకీ అమ్మ అంటూ మెచ్చుకున్నాడు. కానీ షకీలా బాగానే ఉంటుంది గానీ.. ఎంటర్ టైన్ మెంట్ చేయట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఇక అందరికంటే ఎక్కువ రైతుబిడ్డ ప్రశాంత్ నే నెత్తిన పెట్టుకుంటున్నారు ప్రేక్షకులు. అతనికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎంతలా అంటే మొత్తం ఓటింగ్ లో దాదాపు 40 శాతం రైతుబిడ్డకే పడ్డాయి.

Bigg Boss Elimination This Week
చూస్తుంటే మరో రెండు వారాల దాకా ప్రశాంత్ కు ఢోకా లేదని అనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న వారందరి కంటే కూడా ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోయాడు. అంతే కాకుండా రతిక ప్రేమ పేరుతో వాడుకుని వదిలేయడం, అందరూ మనోడిని సెంటర్ ఆఫ్ కార్నర్ చేసి తిట్టడం కూడా బాగా సింపతీని క్రియేట్ చేశాడు. కాబట్టి మనోడికి ఎలాంటి టెన్షన్ లేదు. ఇక షకీలాతో పాడు మరో కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉందని అంటూన్నారు. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది చూడాలి.