Bigg Boss 7 Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు..?
NQ Staff - November 12, 2023 / 10:21 AM IST

Bigg Boss 7 Telugu :
బిగ్ బాస్-7 రోజు రోజుకూ ఇంట్రెస్టింగ్ గానే సాగుతోంది. హౌస్ లో ఇప్పటికే తొమ్మిది వారాలు కంప్లీట్ అయిపోయాయి. ఇక పదో వారం కూడా ఎండింగ్ కు చేరుకుంది. బిగ్ బాస్ లో పదో వారాన్ని పూర్తిగా ఫ్యామిలీ విజిటింగ్ కు మార్చేశాడు బిగ్ బాస్. అయితే పదో వారం పెద్దగా టాస్కులు కూడా జరగలేదు చివరగా శనివారం నాడు కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు. ఇందులో యునామినస్ గా శివాజీ కెప్టెన్ అయిపోయాడు. ఇక ఆదివారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సింది. ఈ వారం నామినేషన్స్ లో రతికా రోజ్, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, భోలే, శివాజీ ఉన్నారు.
వీరిలో ఎవరిని బయటకు పంపిస్తారు అనే విషయం ఆడియెన్స్ డిసైడ్ చేయనున్నారు. ఇక నామినేషన్స్ జరిగిన సోమవారం అర్ధరాత్రి నుంచే ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ వారం శివాజీ అందరికంటే టాప్ పొజీషన్ లో ఉన్నాడు. అతనొక్కడికే దాదాపు 44శాతం ఓటింగ్ లభించింది. అతని తర్వాత గౌతమ్ కృష్ణ 16 శాతం ఓటింగ్ తో రెండో స్థానంలో ఉన్నాడు. వాస్తవానికి మొన్నటి వరకు ప్రిన్స్ యావర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ అతను మూడో స్థానానికి పడిపోయాడు. గౌతమ్ ఇప్పటికే ఓ సారి హౌస్ కెప్టెన్ అయిపోయి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
అందుకే అతను ఈ సారి రెండో స్థానానికి ఎగబాకినట్టు తెలుస్తోంది. ఇక మూడో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉండగా.. నాలుగో స్థానంలో రతిక రోజ్ 14.5శాతంతో ఉంది. ఇక చివరి స్థానంలో భోలే షావలి 13 శాతం ఓటింగ్ తో ఉన్నాడు. దాంతో ఈ సారి భోలే షావలి ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకుంటున్నారు. ఈ సారి రతిక రోజ్ లేదా భోలే షావలిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ చూస్తుంటే రతిక కంటే భోలే షావలినే ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భోలే షావలి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss 7 Telugu 10th Week Elimination
మనోడిపై నెగెటివిటీనే ఎక్కువగా ఉంది. అందుకే అతన్ని ప్రేక్షకులు పెద్దగా ఓన్ చేసుకోవట్లేదు. పైగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హౌస్ కెప్టెన్ కాలేకపోయాడు. ఆట తీరుతో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇలాంటివన్నీ అతనికి నెగెటివ్ గా మారిపోయాయి. అందుకే అతనికి ఓటింగ్ లో తక్కువ శాతం వచ్చింది.
ఇక ప్రస్తుతం హౌస్ లో యుద్ద వాతావరణం కొనసాగుతుంది. శివాజీకి, అర్జున్ కు మధ్య కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఇందులో యునామినస్ గా అందరూ శివాజీనే కెప్టెన్ కావాలంటూ కోరుకున్నారు. దాంతో పదకొండో వారం మొత్తం శివాజీ కెప్టెన్ గా ఉండబోతున్నాడు. మరి ఈ వారం రతిక లేదా భోలే షావలిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.