Bigg Boss 7 New Promo Released : బిగ్ బాస్-7 కొత్త ప్రోమో.. ఈ సారి ఊహకందని క్లైమాక్స్ ఉంటుదంట..!

NQ Staff - August 11, 2023 / 09:21 AM IST

Bigg Boss 7 New Promo Released : బిగ్ బాస్-7 కొత్త ప్రోమో.. ఈ సారి ఊహకందని క్లైమాక్స్ ఉంటుదంట..!

Bigg Boss 7 New Promo Released :

బిగ్ బాస్ కు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ అతిపెద్ద రియాల్టీ షో కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. అలాగే ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ కోసం రెడీ అయిపోయింది. అయితే ఈ ఏడో సీజన్ మునుపెన్నడూ లేనంత కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే రెండు ప్రోమోలను రిలీజ్ చేశారు. గత లాస్ట్ ప్రోమోలో కుడి ఎడమైతే అనే దానికి అర్థం చెప్పాడు నాగార్జున. ఇప్పుడు కొత్త ప్రోమోలో ది ఎండ్ అంటూ నాగార్జున ఓ డైలాగ్ చెప్పేశాడు. ప్రతిసారి క్లైమాక్స్ ఒకే విధంగా ఉంటుందని వాదనలు వస్తున్నాయి. అందుకే ఆ వాదనలకు చెక్ పెట్టేలా నాగార్జున కొత్తగా క్లైమాక్స్ ఉంటుందని చెప్పాడు.

విన్నర్ విషయంలో..

గతంలో ఊహించిన దాని కంటే చాలా భిన్నంగా క్లైమాక్స్ ఉంటుందని తెలిపాడు నాగార్జున. అంటే ఈ సారి సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ ను ఎన్నుకునే విధానం కొత్తగా ఉంటుందని తెలిపాడని తెలుస్తోంది. పైగా ఈ సారి ఎవరి ఊహకు అందని విధంగా సీజన్-7 ఉంటుందని తెలిపాడు నాగార్జున.

దీన్ని బట్టి చూస్తుంటే ఈ సీజన్ లో గతంలో ఎన్నడూ చూడని విధంగా టాస్కులు, పర్ఫార్మెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇక గతంలో లాగా తెలియని ముఖాలను తీసుకురాకుండా అందరికీ తెలిసిన వారినే ఈ సారి హౌస్ లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us