Bigg Boss 7 Got Massive Views : స్టార్ మా ఛానెల్ ను నెంబర్ 1గా నిలబెట్టిన బిగ్ బాస్-7.. ఏం క్రేజ్ రా సామీ..!
NQ Staff - September 16, 2023 / 12:08 PM IST

Bigg Boss 7 Got Massive Views :
బిగ్ బాస్ ఊహించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. గత సీజన్లు ఫెయిల్ కావడంతో వాటిని బాగా దృష్టిలో పెట్టుకున్న యాజమాన్యం ఈ సీజన్-7కు గట్టి ప్రయత్నాలే చేసింది. ఊహించినట్టు గానే ఇప్పటి వరకు గడిచిన రెండు వారాలకు భారీ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఇందుకు కారణం మొదటి నుంచి బిగ్ బాస్ మీద పెంచిన హైప్స్. ఈ సీజన్ గత సీజన్ల లాగా ఉండదని.. అంతా ఉల్టా పల్టాగా ఉంటుందని నాగార్జున చెప్పిన డైలాగులు బాగా పేలాయి. దాంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ గురించి బాగానే చర్చ సాగింది. దెబ్బకు అంచనాలు పెరిగి వ్యూస్ భారీ స్థాయిలో వచ్చాయి.
గ్రాండ్ లాంఛ్ పేరుతో చేసిన మొదటి ఎపిసోడ్ కు ఏకంగా 3కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ చూశారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక మొదటి వారం బిగ్ బాస్ షోను ఏకంగా 5కోట్ల మంది చూశారంట. గత బిగ్ బాస్ సీజన్లకు ఇంతటి స్థాయిలో వ్యూస్ రాలేదు. దాంతో ఇప్పుడు ఈ రేటింగ్స్ విషయం బాగా వైరల్ అవుతోంది. ఇక టెలివిజన్ రేటింగ్స్ లో గత ఆరో సీజన్ కు బిగ్ బాస్ షోకు 9 శాతం రేటింగ్ మాత్రమే వచ్చింది. సీరియల్స్ కు కూడా 12 శాతం వస్తే అంతకన్నా దారుణంగా గత బిగ్ బాస్ ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి.
కాగా ఈ సారి సీజన్-7 షోకు మాత్రం ఏకంగా 18.06 రేటింగ్స్ వచ్చాయి. అంటే ఇది మామూలు విషయం కాదు. దాంతో బిగ్ బాస్ షోకు వస్తున్న వ్యూస్, రేటింగ్స్ వల్ల స్టార్ మా ఛానెల్ మళ్లీ టెలివిజన్ రంగంలో నెంబర్ 1కు వచ్చేసింది. ఇన్ని రోజులు స్టార్ మాకు ఈ స్థాయిలో రేటింగ్స్ రాలేదు. కానీ బిగ్ బాస్ పుణ్యమా ఇది సాధ్యం అయింది. మరీ ముఖ్యంగా ఈ సారి కొందరు కంటెస్టెంట్ల మధ్య బిగ్ బాస్ పెడుతున్న చిచ్చు వల్లనే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. అందులో పల్లవి ప్రశాంత్-రతిక మధ్య మొదట బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ను పెట్టింది. దానికి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు.
ఆ వెంటనే రైతుబిడ్డను రతికతోనే తిట్టించి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది బిగ్ బాస్. సాఫీగా సాగితే ఎవరు చూస్తారు.. ఇలాంటి ట్విస్టులు ఇచ్చేసి చివరకు ఏం జరుగుతుందా అని ప్రేక్షకులు అలాగే చూస్తూ ఉండిపోయేలా చేయడమే బిగ్ బాస్ లక్ష్యంగా కనిపిస్తోంది. పైగా బోల్డ్ బ్యూటీలను కూడా బాగానే తీసుకువచ్చాడు. ఇక రతికతో అప్పుడప్పుడు ప్లేటు తిప్పేయడం లాంటివి చేయిస్తున్నాడు. అటు అమర్ దీప్ తో రైతుబిడ్డను టార్గెట్ చేయించి సింపతీతో వ్యూస్ రాబట్టాడు బిగ్ బాస్.
పైగా పవర్ అస్త్ర, మాయాస్త్ర పేరుతో కంటెస్టెంట్ల మధ్య కావాలనే చిచ్చు పెడుతున్నాడు. ఇలా బిగ్ బాస్ లో గొడవలకు మంచి కారణాలను సృష్టిస్తూ వ్యూస్ సాధిస్తోంది స్టార్ మా యాజమాన్యం. ఇంకేముంది ఈ షో దెబ్బకు రేటింగ్స్ వద్దన్నా వచ్చి పడుతున్నాయి. మరి బిగ్ బాస్ ముందు ముందు కూడా ఇలాగే సాగుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.