Bigg Boss 6 : నేను ఆ తప్పు చేసి ఉంటే నాగార్జున సర్ నన్ను తిట్టాలి కదా : ఫైమా
NQ Staff - December 5, 2022 / 09:53 AM IST

Bigg Boss 6 : బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ఫైమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఇతర కంటెస్టెంట్స్ తో వెటకారంగా మాట్లాడడం వల్లే ఎలిమినేట్ అయ్యాను అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ నేను ఎప్పుడూ కూడా వెటకారంగా మాట్లాడలేదు.
ఇతరులను అవహేళన చేసినట్లు నా మాట తీరు ఉండదు. నా మాట్లాడే తీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దాన్ని కొందరు వెటకారం అంటూ కొందరు పొగరు అంటూ పేర్లు పెడుతున్నారు అని ఆమె అసహనం వ్యక్తం చేసింది.
రేవంత్ గురించి తాను ఫిజికల్ గా స్ట్రాంగ్ అని చెప్పాను కానీ కంటెస్టెంట్ గా ఆయన విన్నర్ అని ఎప్పుడు చెప్పలేదు. ఫిజికల్ గా ఆయన కచ్చితంగా స్ట్రాంగ్.. అందువల్లే టాస్క్ లో ఎక్కువ శాతం ముందుంటాడు. అన్నట్లుగా పైన పేర్కొంది.
రాజ్ తన వల్ల ఎలిమినేట్ అయ్యాడు అనే విషయాన్ని తాను నమ్మను అంది. నా వద్ద ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల ఓట్లు పడలేదు. అందుకే నాకు తక్కువ ఓట్లు వచ్చాయి. అంతే తప్ప రాజ్ ఎలిమినేట్ కు కారణం నేను కాదు. టాప్ 5 లో ఎవరుంటారు అని ప్రశ్నించగా ప్రేక్షకులు ఎవరు కోరుకుంటే వాళ్లే ఉంటారు అని తనదైన శైలిలో సమాధానం చెప్పింది.