బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇద్దరు కమిడియన్లు వీరే..!

Advertisement

‘బిగ్ బాస్ 4’ ప్రస్తుతం ప్రతిఒక్కరు ఈ రియాల్టీ షో గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఆదివారం సాయంత్రం ఈ బిగ్ బాస్ షో.. అక్కినేని నాగార్జున హోస్ట్ గా అంగరంగ వైభవంగా మొదలయ్యింది. అలాగే బిగ్ బాస్ ఎంచుకున్న కంటెస్టెంట్లలో నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి 16 మంది ఎంటరయ్యారు. ఇక ఇప్పటికే ఈ 16మంది గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది ఇలా ఉంటె ఈ పదహారు మందితో సహా మరో నలుగురైదుగురిని ఎక్స్‌ట్రా కంటెస్టెంట్లుగా ఉంచుకునే విషయం తెలిసిందే. అయితే కంటెస్టెంట్లకు ఏమైనా సమస్య వస్తే వారి స్థానంలో వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా వేరే వారు వస్తారు. అయితే కరోనా దృష్ట్యా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే వారి సంఖ్య పెంచనున్నారు అని తెలుస్తుంది. ఎందుకంటె ఎవరికైన కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని బయటకు పంపించి వారి స్థానంలో కొత్త వారిని హౌస్ లోకి పంపించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

అయితే వైల్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఎవరు ఇస్తారో అని అందరు ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే వారిలో హాస్యనటుల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంది. హాస్యనటుల్లో జబర్దస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఇక మరో హాస్యనటుడు ‘ఈ రోజుల్లో’ సినిమా ఫేమ్ సాయి కుమార్ కూడా బిగ్‌బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వినిపిస్తోంది. ఇక ఈ ఇద్దరు హాస్యనటులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే మరింత ఆసక్తికరంగా ఉండనుంది అని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here