బిగ్ బాస్ లో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ మొదలు కానుందా!

Advertisement

బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయ్యి ఇప్పటికే వారం గడిచిపోయింది. మొదటివారంలోనే దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినెట్ అయ్యారు. అలాగే ఇప్పటికే హౌస్ లో గొడవలు, గ్రూప్స్, ప్రేమలు మొదలు అయ్యాయి. ఒకవేళ ఇవేమీ. మొదలు కాకపోతే బిగ్ బాసే టాస్క్ ల పేరుతో సెట్ చేస్తారు. నిన్నటి ఎపిసోడ్ సాయి కుమార్ ఎంట్రీతో ప్రారంభం అయ్యింది. నిన్నటి ఎపిసోడ్స్ తో, ప్రోమోస్ తో హౌస్ లో ఒక కొత్త ప్రేమ జంట తయారు కానుంది. అయితే ఈ ప్రేమ ఓ రాధ ఇద్దరు కృష్ణలుగా మారనుంది.

హౌస్ లో నటి మొనల్ గజ్జర్ తో ఫ్రెండ్లీగా ఉండటానికి హీరో అభిజిత్, అఖిల్ బాగా ప్రయత్నిసున్నారు. మొనల్ కేవలం తనతోనే మాట్లాడాలని అభిజిత్, అఖిల్ ఇద్దరు బాగా ప్రయత్నం చేస్తున్నారు. మొనల్ అఖిల్ తో మాట్లాడితే అభిజిత్, అభిజిత్ తో మాట్లాడితే అఖిల్ బాగా జెలసీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఇద్దరి జెలసీ ప్రవర్తన వల్ల మొనల్ నిన్నటి ఎపిసోడ్ లో ఏడ్చింది కూడా. ఈ ట్రై యాంగిల్ లవ్ ట్రాక్ వల్ల వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ఇంట్లో సభ్యులు కూడా ప్రయత్నిసున్నారు. మొనల్ మాత్రం అఖిల్ ను, అభిజిత్ కేవలం ఫ్రెండ్స్ గానే చూస్తుంది. చివరికి ఈ రాధ ఎవరి ప్రేమకు ఓకే చెప్తుందో లేదా కేవలం ఫ్రెండ్స్ గానే ఉంటారో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here