బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కరోనా. అయోమయంలో నిర్వాహకులు

Advertisement

బిగ్ బాస్ 4 షో కోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఎదురు చుస్తునారు. అయితే ఇప్పటికే కరోనా దృష్ట్యా కాస్త ఆలస్యం అయిన త్వరలో మన ముందుకు రానుంది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో ఒకరికి కరోనా వచ్చినదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్స్‌ ఎంపిక చేశారు. అలాగే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి నెగెటివ్ అని నిర్థారణ అయ్యాక ఓ స్టార్ హోటల్‌లో బస ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది.

పదహారు మంది కంటెస్టెంట్స్ కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఓ సింగర్ కి కరోనా పాజిటివ్ గా వచ్చినట్లు తెలుస్తుంది. ఇక కరోనా బారిన పడిన సింగర్‌ కు బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఇక షో మొదలు అయ్యే లోపు ఆ సింగర్ కు కరోనా నెగిటివ్ వస్తుందో లేదో చూడాలి. ఒకవేళ తనకు నెగిటివ్ రాకపోతే ఆమె స్థానంలో వేరే వ్యక్తిని తీసుకునే ఉద్దేశ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారంట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here