కొత్త టాస్క్ కాదు.. పాతదే..!!

Admin - September 30, 2020 / 06:09 AM IST

కొత్త టాస్క్ కాదు.. పాతదే..!!

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4… అప్ డే్ట్స్…

లగ్జరీ బడ్జెట్ టాస్క్, కెప్టెన్సీ టాస్క్, నామినేషన్స్ టాస్క్, స్పాన్సర్ టాస్క్ ఇలా బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లకి లోటు ఉండదు. అలా అని చెప్పి కొత్త టాస్క్ లు డిజైన్ చేసేంత తీరక ఉండదు. లాస్ట్ సీజన్స్ లో ఇచ్చిన టాస్క్ ల్లో కొన్నింటిని మార్చి మార్చి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా ఇచ్చిన టాస్కే.. కిల్లర్ క్వాయిన్స్..పేరు మారిందేకానీ, టాస్క్ రూపు మారలేదు. గాల్లోనుంచి క్వాయన్స్ వస్తుంటే బిచ్చగాళ్లు ఏరుకున్నట్లుగా పార్టిసిపెంట్స్ ఏరుకోవాలి. అందులోనూ బాగా వర్షం పడి గార్డెన్ ఏరియా, స్విమ్మింగ్ పూల్ ఏరియా బాగా జారిపోతోంది.
సెలబ్రిటీలు కదా ఫిట్ నెస్ ఉంటుందులే అనుకుంటే పొరపాటే.., అమ్మరాజశేఖర్ లాంటి వాళ్లు, గంగవ్వ లాంటి వాళ్లు హౌస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మిగతా వారితో పోటీ పడలేరు. అందుకే గంగవ్వని కూర్చోబెట్టారు. అమ్మరాజశేఖర్ జారిపడ్డాడు కూడా. అయినా కూడా ఆయన గేమ్ ఆడిన పద్దతి హైలెట్ అనే చెప్పాలి.
అందుకే, హౌస్ మేట్స్ అందరూ కూడా అమ్మకి సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చారు. హారిక, అరియానా ఇద్దరూ కూడా అమ్మరాజశేఖర్ కి సపోర్ట్ ఇస్తున్నారు. మరోవైపు సుజాత నోయల్ ఇద్దరూ కలిసి గేమ్ అడుతుంటే, అఖిల్ మోనాల్ ఇద్దరూ ఒక టీమ్ గా గేమ్ ఆడుతున్నారు.
అంతేకాదు, కెప్టెన్సీ టాస్క్ కోసం క్వాయిన్స్ ఇచ్చిపుచ్చుకోవడం చేస్తూ, లాస్ట్ కి మిగిలిన క్వాయన్స్ వేరేవాళ్లకి ఇద్దామని అనుకున్నా కూడా వద్దని బిగ్ బాస్ వారించాడు కూడా. అరియానా , ముక్కు అవినాష్ ల మద్యన కూడా డీల్ కుదిరింది. లాస్ట్ టైమ్ కెప్టెన్ గా ఉన్న శ్రీముఖి ఈ గే్మ్ లో పార్టిసిపేట్ చేయలేదు. అలాగే ఇప్పుడు కెప్టెన్ గా ఉన్న గంగవ్వ పార్టిసిపేట్ చేయలేదు. అయితే, అది నామినేషన్ టాస్క్, ఇది కెప్టెన్సీ టాస్క్ అంతే తేడా. ఇక క్వాయిన్స్ ని ఒకరికొకరు పోటీపడి మరీ కలెక్ట్ చేస్తున్నారు. గంగవ్వ దగ్గరకి వచ్చి దాచుకున్నారు.
అమ్మరాజేశేఖర్ అయితే క్వాయన్స్ ఎవరు ఎక్కడ దాచినా కూడా కనిపెట్టేస్తున్నారు. దానికి తగ్గట్లుగా గే్మ్ ఆడుతున్నారు. ఈ టైమ్ లో ఒక స్పషల్ క్వాయిన్ ని మిస్ చేసుకున్నాడు మెహబూబ్. మరి ఆ క్వాయిన్ ఏంటి.. దాని పవర్ ఏంటి అనేది చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us