బిగ్ బాస్-4 ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసా!

Advertisement

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా సమయంలో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏదన్న ఉందంటే అదే బిగ్ బాస్-4. ఎప్పుడప్పుడు స్టార్ట్ అవుతుందని ఎదురు చూస్తున్న వారికి ‘స్టార్ మా’ ఒక శుభవార్త చెప్పింది. వచ్చే నెల 6వ తేదీన సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానుంది. సీజన్ -3కి హోస్ట్ వ్యవహరించిన నాగార్జుననే సీజన్ -4కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈసారి ఎవరెవరు పాల్గొంటున్నారో అనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వైరల్ అవుతున్నాయి. గత సీజన్స్ కు ఉన్న క్రేజ్ కంటే కూడా ఈసారి లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంకా ఎక్కువ క్రేజీగా వైట్ చేస్తున్నారు. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, శివ బాలాజీ విజేతగా నిలిచారు. సీజన్ 2ను నాని హోస్ట్ చేయగా కౌశల్ విన్నర్ గా నిలిచారు. అలాగే సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు. సీజన్ 4 లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here