ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరు..?

Admin - October 2, 2020 / 05:20 AM IST

ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరు..?

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అనాలసిస్..
కెప్టెన్సీ టాస్క్ అనేది బిగ్ బాస్ హౌస్ లో నాల్గోవారం మంచి మజా ఇచ్చింది. అయితే, ఈ వారం అసలు హౌస్ లో నుంచి ఎవరు వెళ్లిపోబోతున్నారు అనేది కూడా ఉత్కంఠని రేపుతోంది. మూడోవారంలో దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికీ బిగ్ బాస్ ఆడియన్స్ ఇది చాలా అన్ ఫెయిర్ గేమ్ ని అంటున్నారు. దేవి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాల్గోవారం ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ వారం కెప్టెన్ గా కుమార్ సాయి అయ్యాడు కాబట్టి సేఫ్ జోన్ అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే, కెప్టెన్ అయినా కూడా లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేషన్ లో లీస్ట్ ఓటింగ్ వస్తే ఎలిమినేట్ అయిపోతాడు. అయితే, ఈ వారం డేంజర్ జోన్ లో మాత్రం కుమార్ సాయి లేడు.. చాలా వెబ్ సైట్స్ లో ఓటింగ్ లో ముందంజలోనే ఉన్నాడు కాబట్టి సేఫ్ అవుతాడు.
ఇకే డేంజర్ జోన్ లో ఉన్నది ముగ్గురే ముగ్గురు.. ఒకరు సోహైల్, ఇంకొకరు స్వాతి దీక్షిత్, మూడోది మెహబూబ్. ఈ ముగ్గురు ఓటింగ్ లో చాలా లీస్ట్ లో ఉన్నారు. టాస్క్ లు బాగా ఆడి స్ట్రాంగ్ కంటెంస్టెంట్ అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఇక్కడ ప్రజల ఓటింగ్ పైనే ఎలిమినేషన్ అనేది ఆదారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ముగ్గురులో ఒకరు గ్యారెంటీగా ఎలిమినేట్ అయిపోతారు.
అయితే, స్వాతి దీక్షిత్ కి ఇంకోవారం హౌస్ లో ఉండే ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే, నామినేషన్స్ లో ఫస్ట్ వీక్ ఎగ్జంప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉంది. అలాగే మెహబూబ్ , సోహైల్ లు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. మరి చూద్దాం.. ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది..

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us