బిగ్ బాస్ : దయచేసి నా పరువు తీయకండి.. బోరున విలిపించిన మోనాల్

Admin - October 6, 2020 / 06:19 AM IST

బిగ్ బాస్ : దయచేసి నా పరువు తీయకండి.. బోరున విలిపించిన మోనాల్

బిగ్ బాస్ ఫోర్, ఈ షోలో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ పక్రియ జరిగింది. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు ఫైర్ అవుతూ గొడవలు పడ్డారు. ఇక మరికొందరు కంటెస్టెంట్లు అయితే ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. ఇక మొత్తానికి హౌస్ లో చిన్నపాటి సమరం జరిగింది. ఇక అఖిల్, అభిజిత్ ల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా సాగింది. ఇక వారి ఇద్దరి గొడవలో మధ్యలో మోనాల్ ను లాగారు. ఇక ఆమె కోసం కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అని చెప్పాలి. ఇక ఒక్కసారిగా మోనాల్ బోరున విలిపించింది. కంట్లోంచి కన్నీరు పెడుతూ.. ఐ లైక్ యూ అంటే ఇద్దరు ఇష్టమేనని, మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటె మీరు మీరు చేసుకోవాలి అని చెప్పింది.

ఇది ఒక నేషనల్ ఛానల్ అని అందరు చూస్తున్నారని దయచేసి నా పేరు ప్రస్తవించకండి అని ఆవేదన వ్యక్తం చేసింది. నా క్యారెక్టర్ ను బ్యాడ్ చేయకండి. నా గురించి జడ్జ్ చేయడనికి అసలు మీరు ఎవరు అని బోరున విలపిస్తూ కన్నీరు పెట్టింది మోనాల్. ఇక గంగవ్వ వచ్చి మోనాల్ కన్నీరును తన కొంగుతో తుడిచింది. ఇక మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇక మొత్తానికి ఈ వారం అఖిల్ సార్థక్, నోయెల్, అభిజిత్, మోనాల్, అమ్మ రాజశేఖర్, సోహెల్, లాస్య, సుజాత మరియు అరియనా లు నామినేట్ అయ్యారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us