బిగ్ బాస్ సీజన్ – 4 లో కట్టప్ప ఎవరో తెలిసిపోయింది

Advertisement

హాయ్ హలో వెల్ కమ్ టు బిగ్ బాస్ సీక్రెట్ పాయింట్స్..
బిగ్ బాస్ సీజన్ 4 సందడి స్టార్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో అయితే గంగవ్వకి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. గంగవ్వకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక మనం బిగ్ బాస్ హౌస్ లో డే-2 లో టాస్క్ ని గమనించినట్లయితే, లగ్జరీ బడ్జెట్ టాస్క్లో ఆల్ మోస్ట్ అందరూ పెర్ఫామెన్స్ చేశారు. అయితే, దీని కంటే ముందు బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో క్యూరియాసిటీని పెంచేందుకు బిగ్ బాస్ హౌస్లో మీతో ఉంటూనే వెన్నుపోటు పొడిచే ఆకట్టప్ప ఎవరు అని కనిపెట్టాలని ఆదేశించాడు. దీంతో ఎవరికి వారు గెస్ చేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ లాస్య అండ్ కల్యాణి ఇద్దరూ కూడా సూర్యకిరణ్ కట్టప్పే అని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ఒకరకంగా సపోర్ట్ చేస్తూనే మళ్లీ వెంటనే మారిపోతున్నాడని అనుకున్నారు.
ఇక బిగ్ బాస్ దీనికోసం ఓటింగ్ ని సైతం పెట్టాడు. అందరూ కట్టప్ప ఎవరో గెస్ చేస్తూ ఓటింగ్ వేసారు. ఫస్ట్ మనం ఎవరెవరు ఎవరికి ఓటింగ్ వేసారనేది చూసినట్లయితే..


నోయల్ – మెహబూబ్ అని గెస్ చేసి ఓట్ వేసాడు.
దేవి నోయల్ అని రాసింది. దేత్తడి హారిక సూర్యకిరణ్ పేరు రాసింది. దివి నోయల్ పేరు రాసింది. లాస్య సూర్యకిరణ్ పేరు రాసింది. అఖిల్ నోయల్ పేరు రాసాడు. అబిజిత్ అమ్మరాజశేఖర్ పేరు రాసాడు. మోనాల్ అమ్మరాజశేఖర్ రాసింది. కళ్యాణి అఖిల్ పేరు రాసింది. అమ్మరాజశేఖర్, సూర్యకిరణ్, సుజాత, గంగవ్వ ఈ నలుగురు కూడా అఖిల్ పేరే రాసారు. సో అఖిల్ కి హైఎస్ట్ ఓట్లు వచ్చాయి. అఖిల్ సార్ధక్ ని హౌస్ మేట్స్ లో మెజారిటీ పీపుల్ కట్టప్పగా అనుకుంటున్నారన్నమాట. అయితే, కట్టప్ప అనడానికి బిగ్ బాస్ మనకి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. అంతేకాదు, కట్టప్పగా హౌస్ మేట్స్ ఎవరు కూడా బిహేవ్ చేయడం లేదు. ఇలాంటి టైమ్ లో అసలు కట్టప్ప ఎవరు అనేది కనీసం ఆడియన్స్ కి చెప్పినా బాగుండేది. హౌస్ మేట్స్ గెస్సింగ్ రైటో రాంగో తెలిసేది.
ఇక హౌస్ మేట్స్ మెజారిటీ ఓట్లు వేసారు కాబట్టి బిగ్ బాస్ కూడా అఖిల్ నే కట్టప్పగా చేస్తాడని అనుకుంటున్నా.. ఎందుకంటే ఇప్పటి వరకూ సీక్రట్ టాస్క్ ఇవ్వలేదు కాబట్టి అఖిల్ సార్తక్ కట్టప్ప అవుతాడని నా గెస్సింగ్.
ఇక సీక్రట్ రూమ్ నుంచి హౌస్ లోకి వచ్చిన సయ్యద్ సోహైల్ కి, అభిజిత్ కి ఒక మినీ యుద్ధం జరగబోతోంది. రేపటి ఎపిసోడ్ లో ఈ వార్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Written By : Paritala Murthy

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here