బిగ్ బాస్ హైలెట్స్ అండ్ రివ్యూ

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో 11వ రోజు సుజాత… అభిజిత్ తో మాట్లాడాలని లాస్యను కొద్దీ సేపు పక్కకు వెళ్ళమంటుంది. ఆ విషయానికి ఫీల్ అయిన లాస్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తరువాత సుజాత… లాస్య దగ్గరకు వచ్చి ఎందుకలా అనింది అని ఎక్స్ ప్లానేషన్ ఇస్తుంది. అంతే కాకుండా… ఈ ఇద్దరూ అభిజిత్, సుజాతను సిస్టర్ అన్న విషయం గురించి కొద్దీ సేపు డిస్కస్ చేస్తారు.


ఇక ఆ తరువాత బీబీ టీవీ షో మొదలవుతుంది. కెప్టెన్ లాస్య ఆ షోకి హోస్ట్ గా మారుతుంది. మొదటగా పార్ఫర్మ్ చేయడానికి కుమార్ సాయి అండ్ టీం వస్తుంది. ఆ టీంలో అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, దివి, హారిక లు టీం మేట్స్. ఇక ఫస్ట్ పర్ఫామెన్స్ ఇరగదీసేసారు మనవాళ్ళు. ఆ తరువాత వచ్చిన ముక్కు అవినాష్ టీం కూడా చాలా బాగా చేసింది. ఇక అవినాష్ టీం సభ్యులు కల్యాణి, మోనల్, అఖిల్, సుజాత. అందరూ కూడా చాలా బాగా చేశారు, ఇక అందులోనూ అవినాష్ టైమింగ్ గురించి చెప్పాలా ఏంటి.


ఈ రెండు పర్ఫామెన్స్ అయిపోయిన తరువాత ఇద్దరి పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చాయి. కానీ గంగవ్వకు అవినాష్ టీం చేసిన స్కిట్ నచ్చింది అని వారిని విన్నర్ అని చెప్పేస్తాడు నోయెల్. ఈ విషయానికి అమ్మ రాజశేఖర్ మాస్టర్ చాలా హర్ట్ అవుతాడు. ఆయనకు కన్విన్స్ చేయడానికి మిగతా వారు వచ్చినా కూడా సాటిస్ఫై అవ్వడు రాజశేఖర్. అంతే కాకుండా ఆ రిజల్ట్ ఇచ్చినందుకు నోయెల్ ను వేస్ట్ ఫెలో, ఇరిటేట్ చేస్తున్నాడు అంటాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అమ్మ రాజశేఖర్ ఇలా మాట్లాడటటం ఇదే మొదటిసారి.


ఈ లోపు బిగ్ బాస్ ఇద్దరూ విన్నర్స్ అనే ఉద్దేశంతో స్టోర్ రూమ్ లో రెండు ఫ్రూట్ జ్యూస్ బాటిల్స్ పెడతాడు. అది చూసిన అందరూ ఆనందంతో గంతులేస్తారు. ఇక ఆ మరుసటి రోజు కిచెన్ విషయం లో దేవి నాగవల్లికి, లాస్య కు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ‘నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు… నామినేషన్ ప్రక్రియ తరువాత ఎదో జరిగింది… మీరు మీరు మాట్లాడుకొని నన్ను దూరం పెడుతున్నారు’ అని దేవి అంటుంది. ఆ విషయం గురించి ఎంత కన్విన్స్ చేసిన దేవి వినదు. ఐ కెన్ ఫీల్ ఇట్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవి.


ఈ గ్యాప్ లో బిగ్ బాస్ అందరితో మాట్లాడుతూ.. ఇంటి నియమాలను ఎవ్వరూ పట్టించుకోవట్లేదని అందరూ తెలుగులో మాట్లాడట్లేదని, పిలవగానే ఎవ్వరూ రావట్లేదని, మైక్ సరిగ్గా ధరించట్లేదని బిగ్ బాస్ అందరికీ పనిష్మెంట్ ఇస్తాడు. బెల్ మోగగానే అందరూ గుంజిళ్ళు తీయాలని… ఆ తరువాత… సుజాత దగ్గర… అభి, మోనాల్, నోయెల్, హరికలు తెలుగు నేర్చుకోవాలి అని చెబుతాడు. అందరూ ఆ పనిష్మెంట్ అనుభవిస్తారు. కానీ రెండవ సారి మాత్రం నోయెల్… ఇలా అయితే నాకెంతమంది సారీ చెప్పాలో తెలుసా… అని బిగ్ బాస్ నాకు సారీ చెప్పాలి అంటాడు.
ఆ తరువాత పనిష్మెంట్ అయిపొయింది అన్న బిగ్ బాస్… నెక్స్ట్ హౌస్ కెప్టెన్ ను సెలెక్ట్ చేసుకునే టైం వచ్చింది అంటాడు. లాస్య పైకి లేచి… నోయెల్, అభి, మెహబూబ్, దేవి ల పేర్లు చెబుతుంది. కానీ బిగ్ బాస్ దేవి పేరుపక్కన పెట్టి కళ్యాణి పేరు చెబుతాడు. ఇంటి సభ్యులు వారిలో నుండి నోయెల్ ను కెప్టెన్ గా సెలెక్ట్ చేస్తాడు.


ఆ తరువాత నోయెల్ కిచెన్ టీంను సెలెక్ట్ చేసే ప్రాసెస్ లో దేవికి అమ్మ రాజశేఖర్ కు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఈ సారి కొంచెం ఘాటుగానే జరుగుతుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు లేనంతగా వాయిస్ పెంచద్దు అని దేవి అనగా… నువ్వు పెంచితే నేను పెంచుతా అని అమ్మ రాజశేఖర్ అంటాడు. ఆ తరువాత వారిని కూల్ చేసి కంటిన్యూ అవుతారు మిగతా వారు. రాత్రి 12 గంటలకు అందరినీ నవ్వించడానికి ట్రై చేసిన అవినాష్ అక్కడ మళ్ళి మోనాల్ పేరు తెస్తాడు. ఈ సారి తన పేరు వాడినందుకు మోనల్ హర్ట్ అవుతుంది. ఈ విషయానికి మొనల్ దగ్గరకు వెళ్లి సారీ కూడా చెబుతాడు అవినాష్. ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వెయిట్ చేయాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here