ఈ నెల 30న బిగ్ బాస్-4 ప్రారంభం కానుందా?

Advertisement

తెలుగులో బిగ్ బాస్ సృష్టించిన సంచలనం గురించి ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఇప్పటికే ఈ ప్రోగ్రాం తెలుగులో 3 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగావ్యవహరించగా, సీజన్-2 కు నాని యాంకర్ గా కార్యక్రమాన్ని నడిపించారు. ఇంకా 3 సీజన్ కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ లో హీరో శివ బాలాజీ, సీజన్ 2లో సీరియల్ నటుడు కౌశల్, మూడో సీజన్ లో సింగర్ రాహుల్ విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ఒక విధంగా తెలుగు ప్రజలు బానిసలయ్యారు. అందుకే నాలుగో సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సీజన్ ఈనెల 30న ప్రారంభం కానుందని ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే సీజన్-4 కు చెందిన యాడ్ షూట్ జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 29న నాగార్జున పుట్టిన రోజు కాబట్టి ఈ సందర్బంగా ఈనెల 30 నుండి బిగ్ బాస్ ను ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిస్తున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో వేచి చూడాలి. ఈ సీజన్ లో ఎవరెవరు పాల్గొంటారోనని ఇప్పటికే చర్చలు ప్రారంభం అయ్యాయి. సోషల్ మీడియాలో కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here