బిగ్ బాస్ : అవినాష్ కు అదిరిపోయే పంచ్ వేసిన గంగవ్వ

Admin - October 2, 2020 / 12:45 PM IST

బిగ్ బాస్ : అవినాష్ కు అదిరిపోయే పంచ్ వేసిన గంగవ్వ

బిగ్ బాస్ ఫోర్, ఎప్పటికి టాస్కులు, గొడవలతో కనిపించే హౌస్ మేట్స్.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో సందడిచేస్తూ కనిపించారు. అయితే ఈ రోజు ఎపిసోడ్ కు సంబందించిన ఒక ప్రోమోను విడుదల చేసారు. ఇక ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ అందరు ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతూ ఫ్యాషన్ షో చేస్తూ కనిపించారు. ఇక హౌస్ మేట్స్ అందరు కూడా రాంప్ వాక్ చేస్తూ ఉర్రుతలాడించారు. ఇక వీరు సందడి చేసిన తరువాత అవినాష్ అద్దంలా మారుతాడు అని ఆదేశిస్తాడు బిగ్ బాస్.

ఇక ఆ అద్దం అంటే అవినాష్ ముందుకు లేడీ కంటెస్టెంట్లు వచ్చి కూర్చొని వాళ్ళ అందం చూసుకుంటారు. అయితే ముందుగా గంగవ్వ వచ్చి అద్దం ముందు కూర్చొని.. ‘అద్దం కాకిలా ముక్కు ఇంతపెద్దగా ఉంది’ అని అంటుంది గంగవ్వ. ఇక గంగవ్వ మాటకు హౌస్ మేట్స్ అందరు ఫుల్ గా నవ్వుతారు. తరువాత మోనాల్ వచ్చి కూర్చుంటుంది. ఇక అవినాష్.. ‘ఎప్పటి నుండో ఈ అవకాశం గురించి ఎదురు చూస్తున్న.. బిగ్ బాస్ ఇలా కనెక్ట్ చేస్తాడని అస్సలు అనుకోలేదు’ అని సంబురపడుతూ ఖుషి అవుతాడు.

ఇక మోనాల్.. ‘నా జుట్ట బాగుంది’ అంటుంది. ‘అది జుట్ట కాదు జుట్టు’ అని అవినాష్ అంటాడు. ఇక అందరు తెగ నవ్వుతారు. ఇక తరువాత స్వాతి వస్తుంది. ఇక ఆమెకు కూడా ఓ పంచ్ వేస్తాడు అవినాష్. ఇక తరువాత హారిక వస్తుంది. హరికకు ‘హైట్ సరిపోతలేదు’ అని అంటాడు. ఇక ఇలా అందరు లేడీ కంటెస్టెంట్లు అవినాష్ (అద్దం) ముందుకు వచ్చి సందడి చేస్తారు. ఇక ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు జరిగే ఫ్యాషన్ షో అదిరిపోయేలా ఉంటుందని అనిపిస్తుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us