బిగ్ బాస్ ఎపిసోడ్ 4 ఫుల్ రివ్యూ

Advertisement

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 అప్ డేట్స్…
బిగ్ బాస్ హౌస్ లో మూడోరోజు అసలు కంటెంట్ ఏమీ లేదు. ప్రోమోలో ఉన్న క్యూరియాసిటీ ఎపిసోడ్ లో లేదు. మనం రివ్యూలోకి వెళ్తే..,
రెండో రోడు రాత్రి 12గంటల తర్వాత సీక్రట్ రూమ్ లో ఉన్న అరియానా అండ్ సయ్యద్ ఇద్దరూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సయ్యద్ అందర్నీ పలకరిస్తూనే లివింగ్ రూమ్ లో అందర్నీ గేదర్ అవ్వమని చెప్పాడు. నోయల్ ని ఫోన్ ఎందుకు కట్ చేశావ్ అని అడిగాడు. అక్కడ నోయల్ ఫుడ్ పెడదామనే అనుకున్నాం అని అందుకే మొదటి రోజు పంపామని చెప్పి గంగవ్వ లాంటి ఏజ్ పర్సన్ టీ లేకుండా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఉండలేకపోయారు అని చెప్పే ప్రయత్నం చేశాడు. సయ్యద్ ఆర్గ్యూ చేశాడు. మాటలు పెరిగాయి. నేను ఫోన్ కట్ చేశాను కాబట్టే ఈ రోజు మీరు హౌస్ లోకి వచ్చారు అని నోయల్ హౌస్ మేట్స్ కి కంగ్రాట్స్ చెప్పాడు. అరియానా తనదైన స్టైల్లో రెచ్చిపోయింది. నోయల్ ని నిలదీసే ప్రయత్నం చేసింది. కానీ నోయల్ చాలా లైట్ తీస్కున్నాడు.
ఈ లోగా అభిజిత్ లేచి మీరు ఫైటింగ్ యాటిడ్యూట్ తో రావద్దు.. కూల్ గా మాట్లాడాలి అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, ఇక్కడే ఇద్దరూ బిగ్గర్ టోన్ తో మాట్లాడుకుని ఫైటింగ్ కి దిగారు. అభిజిత్ ఎక్కడా తగ్గలేదు.. 14మంది మీరు చెప్పేది విన్నాకే రేజ్ అయ్యామని చెప్పాడు. దీంతో ఇద్దరి మద్యలో కాస్త గట్టిగానే ఫైట్ అయ్యింది.
తర్వాత నోయల్ ని అరియానా నిలదిసే ప్రయత్నం చేసింది. కానీ నోయల్ నువ్వు ఏమి చేసినా నన్ను రెచ్చగొట్టలేవ్ అంటూ చెప్పాడు. సయ్యద్, అరియానా ఇద్దరికి ఫుడ్ పెట్టారు. సయ్యద్ కూల్ గా ఫుడ్ తింటుంటే అరియానా నాకు ఎవరైనా తినిపించాలి అంది. అంతే కాదు, వాళ్లు తినిపిస్తే నేను నవ్వాలి అని చెప్పింది. దీంతో అఖిల్ అరియానాకి తినిపించాడు. మిగతా హౌస్ మేట్స్ ఇది టాస్క్ అయి ఉండచ్చు కదా.. నువ్వు ఎందుకు తినిపించావ్ అని అన్నారు. హ్యూమానిటీ బేసిస్ లో నేను చేశానని చెప్పాడు అఖిల్. ఇది చిన్న విషయమే అయినా చిలికి చిలికి గాలివానలా మారింది. ఇక్కడే నోయల్ ఎప్పుడైనా అవ్వకి తినిపించావా అని అఖిల్ ని అన్నాడు. దానికి అఖిల్ బాగా హర్ట్ అయ్యాడు.
12.45 నిమిషాలకి గార్డెన్ ఏరియాలో కూర్చుని అఖిల్ చాలా ఫీల్ అయ్యాడు. అఖిల్ ఫీల్ అవుతుంటే అబిజిత్ కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇదే టైమ్ లో సయ్యద్ కి హారిక ఎక్స్ ప్లైయిన్ చేసే ప్రయత్నం చేసింది. అబిజిత్ చాలా కూల్ పర్సన్ అని మీరు అలా మాట్లాడే సరికి రైజ్ అయ్యాడని చెప్పింది. దీంతో సయ్యద్ బాగా కూల్ అయ్యాడు. ఇది టాస్క్ అని చెప్పాడు.
1.15 నిమిషాలకి గార్డెన్ ఏరియాలో కళ్యాణి మాట్లాడుతుంటే దేవి – అభిజిత్ ఇద్దరూ లేచి వెళ్లిపోయారు. ఇది కళ్యాణికి నచ్చలేదు. కళ్యాణి హర్ట్ అయ్యింది. ఇదే విషయాన్ని సూర్యకిరణ్ తో చెప్పుకుంది.
ఇదే సమయంలో అబిజిత్ తో సయ్యద్ ఇది టాస్క్ అని చెప్పాడు. దీంతో ఇద్దరూ కూల్ అయ్యారు. వెల్ ప్లేయిడ్ అని చెప్పాడు అభిజిత్.
రాత్రి 2 గంటలకి కళ్యాణి – మోనాల్ తో చెప్పుకుని బాధపడింది. వీరిద్దరూ సయ్యద్ అండ్ అరియానా గురించి మాట్లాడుకున్నారు.
2.15 నిమిషాలకి దివి – సుజాత , హారిక లాస్యలు స్మిమ్మింగ్ పూల్ దగ్గర డిస్కషన్ పెట్టారు. సయ్యద్ గురించి, అరియానా గురించి మాట్లాడుకున్నారు.
రాత్రి 2.30 నిమిషాలకి అఖిల్ అండ్ నోయల్ ఇద్దరూ మాట్లాడుకుని ఒక అండర్ స్టాడింగ్ కి వచ్చారు.
ఇక రాత్రి 3గంటలకి మోనాల్ అండ్ అఖిల్ ఇద్దరూ చాలాసేపు డిస్కషన్ చేస్కున్నారు. మోనాల్ తను వాటర్ ఇస్తే అరియానా తాగలేదని అఖిల్ తో చెప్పింది.
3.45నిమిషాలకి సయ్యద్ అరియానికి క్లాస్ పీకాడు. ఇవన్నీ నువ్వు ఓవర్ గా ఎందుకు చేస్తున్నావ్ అంటే., ఇది నా గేమ్ ప్లాన్ నేను ఇంట్లో వాళ్ల మనస్తత్వాలని చూస్తున్నాను అంది. దీంతో నీ ఇష్టం అన్నాడు సయ్యద్.
పొద్దున్న మూడో రోజు ఉదయం మెగాస్టార్ సాంగ్ కి అందరూ స్టెప్పులు వేసారు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ రెచ్చిపోయారు. 8.30నిమిషాలకి సుజాత అఖిల్ కాసేపు మాట్లాడుకున్నారు. అభిజిత్ కూడా జాయిన్ అయ్యి నిన్న జరిగిన సంఘటనల గురించి చెప్పుకున్నారు.
9.15 నిమిషాలకి కళ్యాణి మోనాల్ ఇద్దరూ కూడా కాసేపు వాష్ రూమ్ దగ్గర టాస్క్ గురించి డిస్కషన్ చేస్కున్నారు. 9.30నిమిషాలకి హారికా మోనాల్ ఇంగ్లీష్ మాట్లాడటం గురించి చెప్పుకున్నారు. నీకు ఇంగ్లీష్ బాగా వస్తుంటే తెలుగులో దీన్ని ఏమంటారు నన్ను అడుగు చెప్తాను అంటూ చెప్పింది.
ఇద్దరూ లాజిక్స్ వర్కౌట్ చేశారు.
9.45 నిమిషాలకి అవ్వ డంబుల్స్ ఎత్తి కాసేపు ఫన్ చేసింది. జిమ్ ఏరియాలో జిమ్ చేసి ఎంటర్ టైన్ చేసింది. అందరూ ఎక్సర్ సైజులు చేశారు. దివి యోగా చేసింది. గంగవ్వ – హారిక లాస్య కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అప్పుడే అక్కడకి అరియానా గంగవ్వ నీకు స్ప్రే కొట్టనా అని అడిగింది. నాకు వద్దు నువ్వు వెళ్లు అని గంగవ్వ ఫన్నీగా మాట్లాడింది. దీంతో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది.

Written By : Paritala Murthy

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here