బిగ్ బాస్ : కెప్టెన్సీ కోసం భలే టాస్క్
Admin - October 1, 2020 / 07:08 AM IST

బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన కాయిన్స్ టాస్క్ భలే మజా తీసుకొచ్చింది. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు కాయిన్స్ కోసం ఒకరిదగ్గర నుండి మరొకరు దొంగతనం చేసి దొంగలుగా మారారు. ఇక ఇది ఇలా ఉంటె బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ రోజు ఎపిసోడ్ కు సంబందించిన ఒక ప్రోమోను విడుదల చేసాడు. ఇక ఈ ప్రోమో చూస్తుంటే మరో ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక హౌస్ లో కొత్త కెప్టెన్ ఎంపికకు ఒక బురద లో ఉన్న కాయిన్స్ ను ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తారో వారే హౌస్ కెప్టెన్ అని చెప్తాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ పేరు కాసుల వేట. ఇక ఈ టాస్క్ లో హారిక, కుమార్ సాయి, అమ్మరాజశేఖర్, సుజాత లు పోటీ పడ్డారు. మరి ఎక్కువ కాసులు ఎవరు కలెక్ట్ చేస్తారో.. ఎవరు హౌస్ కెప్టెన్ గా నిలుస్తారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.