అభిజిత్ అఖిల్ మద్యలో మోనాల్..! End Card పడిందా..?

Admin - October 7, 2020 / 05:19 AM IST

అభిజిత్ అఖిల్ మద్యలో మోనాల్..! End Card పడిందా..?

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అప్ డేట్స్…
బిగ్ బాస్ హౌస్ లో 30 రోజులు గడిచిపోయింది. మోనాల్ , అఖిల్, అండ్ అభిజిత్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే , ఫస్ట్ నుంచి కూడా దీన్ని ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగానే ప్రొజెక్ట్ చేసింది బిగ్ బాస్ టీమ్. అఖిల్ అయితే ఎప్పుడూ మోనాల్ తోనే ఉన్నాడు.. మిగతా హౌస్ మేట్స్ ని అసలు పట్టించుకోలేదనే చెప్పాలి. అందుకే లగ్జరీ బడ్జెట్ విషయంలో చాలామంది అఖిల్ ని నామినేట్ చేశారు కూడా. అంతేకాదు, అఖిల్ చెప్పిన రీజన్స్ ని కూడా నామినేషన్స్ లో తీసుకోలేకపోయారు. ఫస్ట్ వీక్ నుంచి ఉన్న సీన్స్ అన్నీ చెప్పేసరికి.. అభిజిత్ ఫుల్ ఫైర్ అయ్యాడు. దీని వల్ల 5వ వారం నామినేషన్స్ అనేవి హీటెక్కిపోయాయి. ఈ నామినేషన్స్ తర్వాత మోనాల్ ని కూల్ చేసేందుకు అభిజిత్ సారీ కూడా చెప్పాడు.
అనవసరంగా నీ టాపిక్ ని అఖిల్ తీసుకుని వచ్చాడని,, అందుకే నేను మాట్లాడాల్సి వచ్చిందని చెప్పాడు. మోనాల్ కి సారీ చెప్పాడు. తప్పుగా అయితే నేను ఏం మాట్లాడలేదని అన్నాడు. మోనాల్ నాకు లైక్ యూ అని చెప్తే.., నువ్వు ఎక్కువ ఫీల్ అయ్యావ్ అన్నానని హిందీలో ఎక్స్ ప్లెయిన్ చేశాడు. ఇక్కడే మోనాల్ అసలు నామినేషన్స్ జరిగేటపుడు నా టాపిక్ ఎందుకు అని నిలదీసి అడిగింది. అది అఖిల్ తీసుకుని వచ్చాడని చెప్పాడు అభిజిత్.
ఇక అఖిల్ తో మోనాల్ మాట్లాడేటపుడు ఈ విషయం పై ఫుల్ క్లారిటీ వచ్చింది. ముందుగా నీ టాపిక్ తీసుకుని రావచ్చా అని అడిగితే నువ్వు ఓకే అన్నావ్ అని, అందుకే తెచ్చానని అఖిల్ గుర్తు చేసాడు. దీంతో ఈ టాపిక్ కి ఎండ్ కార్డ్ పడింది.
నిజానికి అసలు రీజన్స్ ఏమీ లేకుండా అఖిల్ కి అభిజిత్ కి చిన్నపాటి వార్ అయ్యింది. ఫస్ట్ వీక్ నుంచి ఈగో ఫీలింగ్స్ తోనే ఉన్నారు ఇద్దరూ. ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి, అలాగే అరేయ్ అన్న పాయింట్స్ గురించే మాట్లాడారు. అఖిల్ మోనాల్ విషయాన్ని తీసుకుని వస్తూ.., నువ్వు పెద్ద డ్యూడ్ లాగా మాట్లాడకు అనేసరికి అభిజిత్ ఎక్కడా తగ్గలేదు. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. మినీ యుద్ధమే చేశారు. ఈ టాపిక్ లో మోనాల్ ఫుల్ ప్రస్టేట్ అయ్యింది. బరెస్ట్ అయ్యింది. మోనాల్ ని కూల్ చేయడానికి ఇద్దరూ కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత మోనాల్ దగ్గరకి అభిజిత్ వచ్చి ఒక అగ్రిమెంట్ కూడా రాశాడు. నెక్ట్స్ నుండీ నేను నీ టాపిక్ ఎప్పుడూ కూడా వేరేవాళ్ల దగ్గర డిస్కస్ చేయను అని చెప్పాడు. దాని వల్ల నువ్వు హర్ట్ అయి ఉంటే సారీ అని చెప్పాడు.
నిజానికి నామినేషన్స్ అప్పుడు ఇదే విషయాన్ని అఖిల్ కి కూడా ఎక్స్ ప్లైయన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పుడు హీట్ లో ఉండటం వల్ల ఎవరికీ ఎక్కలేదు. ఏదైతే చెప్పాడో ఇప్పుడు అదే చేశాడు. దీంతో ఈ స్టోరీకి ఎండ్ కార్డ్ పడిందనే అనుకుంటున్నారు అందరూ.
మళ్లీ నామినేషన్స్ లోకి ఈ టాపిక్ రాకుండా ఉంటే.. ఇక్కడితో ఇది ముగిసినట్లే.. బిగ్ బాస్ హౌస్ లో మరో కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ కావాల్సిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us