Bigg boss Winner : ప్రభాస్ సినిమాలో చాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ విన్నర్?

Bigg boss Winner : ప్రస్తుతం ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా హీరో. ఆయన ఇప్పుడు కేవలం టాలీవుడ్ కే చెందిన హీరో కాదు. ఆయన రేంజ్ మారిపోయింది. నేషనల్, ఇంటర్నేషన్ లేవల్ లో ప్రభాస్ అందరికీ సుపరిచితం అయ్యాడు. కేవలం బాహుబలి సిరీస్ తో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. బాహుబలి తర్వాత ఆయన చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తయింది. తన నెక్స్ ట్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ కూడా స్టార్ట్ అయింది. రాబోయే కొన్ని నెలల పాటు ఆదిపురుష్ సినిమాకే క్యాల్షీట్లు కేటాయించాడు ప్రభాస్. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడినా.. త్వరలోనే సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది.

bigg boss 13 winner Sidharth Shukla in prabhas adipurush movie
bigg boss 13 winner Sidharth Shukla in prabhas adipurush movie

అయితే.. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో బిగ్ బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లాకు చాన్స్ దక్కిందట. ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రావత్.. సిద్ధార్థ్ శుక్లాకు ఆదిపురుష్ సినిమాలో మేఘనాధుడి పాత్రను ఇచ్చారట. దీంతో మేఘనాధుడి పాత్రలో సిద్ధార్థ్ మెరవబోతున్నాడన్నమాట. సిద్ధార్థ్ పోయిన సంవత్సరం బిగ్ బాస్ 13 సీజన్ విన్నర్. బాలీవుడ్ లో ఇప్పటికే రెండు మూడు సినిమాల్లోనూ, సీరియళ్లలోనూ నటించాడు. అయితే.. తనకు విపరీతమైన స్టార్ డమ్ బిగ్ బాస్ ద్వారా వచ్చింది. సీరియళ్లలో పెద్ద స్టార్. అందుకే.. సిద్ధార్థ్ అయితే మేఘనాధుడి పాత్రకు సరిగ్గా సరిపోతాడని ఓం రావత్.. అతడిని ఆదిపురుష్ లో తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక.. ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ లో సీతగా కృతి సనన్ కనిపించనుంది. ఇక.. సినిమా షూటింగ్ ఇప్పటికే పలు కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ జరగాల్సి ఉంది కానీ.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇంకా మరో మూడు నెలల షూటింగ్ పెండింగ్ లో ఉందట. ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్ కే తన ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. ప్రభాస్.. సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.