అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు?

Advertisement

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ కరోనా అటు సినీ పరిశ్రమని కూడా వదలడం లేదు. తాజాగా టాలీవుడ్, బాలివుడ్ మరియు ఇతర టీవీ షోలలో చాలా మంది నటులకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే..

తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కు మరియు తన కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మినహా వాళ్ళ కుటుంబంలోని అందరికి కూడా కరోనా సోకిందని ఆయనే స్పష్టంగా వెల్లడించారు.

ఇది ఇలా ఉంటె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ లోని మరో కొంతమంది సినీ ప్రముఖులకు కూడా కరోనా సోకిందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. అయితే కపూర్ కుటుంబానికి కూడా కరోనా సోకిందని అంటున్నారు. కపూర్ కుటుంబంలో ఉన్న నీతూ కపూర్, రణబీర్ కపూర్ ల ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలకు రిద్ధిమా కపూర్ తీవ్రంగా స్పందించింది. తాను మాట్లాడుతూ మాకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని మేము ఆరోగ్యంగానే ఉన్నామని తెలిపారు. అలాగే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఆమె ఫైర్ అయ్యారు.

ఇక వివరాల్లోకి వెళితే కొన్ని రోజుల క్రితం రీతూ కపూర్ అరవై రేండోవ పుట్టినరోజు జరిగింది. ఈ పుట్టినరోజు వేడుక సందర్భంగా రిద్ధిమా కపూర్ పార్టీ నిర్వహించింది. ఈ వేడుకలో కపూర్ కుటుంబం తో పాటు అగస్థ్య నంద, నితాషా నంద, కరణ్ జోహార్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అయితే రిద్ధిమా కపూర్ ఏర్పాటు చేసిన ఈ పుట్టిన రోజు వేడుకకు అమితాబ్ బచ్చన్ మనువడు అగస్థ్య నంద కూడా వెళ్లాడు.కావున తన వల్లే అమితాబ్ కుటుంబానికి కరోనా సోకిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

మరోవైపు ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి కూడా కరోనా సోకి ఆసుపత్రిలో చేరింది అని పుకార్లు వచ్చాయి. దీనికి ఆమె స్పందించి తాను బాగానే ఉన్నానని ట్విట్టర్ లో ఒక వీడియో పెట్టి స్పష్టం చేసింది. మొత్తానికి ఈ కరోనా తో తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో జోరుగా చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here