జగన్ గారు నీ పై కుట్ర జరుగుతుంది చుస్కో : రామ్ పోతినేని

Advertisement

టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతునేని సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేస్తూ.. “పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది. సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి జగన్ గారు మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్ కీ‌,మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం” అని ‘ఏపీ గమనిస్తోంది’ అంటూ హ్యాష్ టాగ్ కూడా పెట్టారు. అలాగే హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు ఏపీ సర్కార్ అక్కడ క్వారంటైన్ సెంటర్ గా వినియోగించుకుంది.

అయితే అప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు అని ప్రశ్నించారు. ఒకవైపు సోషల్ మీడియాలో రామ్ ట్వీట్ కు భారీగా రిప్లయ్ లు ఇస్తున్నారు. అయితే రమేష్ హాస్పిటల్స్ తమ బంధువుది అందుకోసమే రామ్ స్పందించారు అని కొందరు అంటున్నారు. మరికొందరు ఏమో ఆ హాస్పిటల్ రామ్ బాబాయిది కనుక అందుకే స్పందిస్తున్నడని అంటున్నారు. ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడని రామ్ ఒక్క సారిగా జగన్ కి ట్వీట్ చేసే సరికి హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here