Time Machine : టైమ్ మెషీన్ వచ్చేసిందహో.! అది కాదండీ, నిజం నమ్మండీ.!

NQ Staff - December 8, 2022 / 11:45 AM IST

Time Machine  : టైమ్ మెషీన్ వచ్చేసిందహో.! అది కాదండీ, నిజం నమ్మండీ.!

Time Machine  : టైమ్ మెషీన్ వచ్చేసిందంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. బోల్డన్ని కట్టు కథలు అల్లబడుతున్నాయి. అప్పుడెప్పుడో ‘ఆదిత్య 369’ సినిమాలో చూసిన టైమ్ మెషీన్ లాంటిదే, తెలంగానలోని వికారాబాద్‌లో ఓ రైతు వ్యవసాయ భూమిలో దిగింది. దాంతో, అంతా విస్తుపోయారు.

అరరె.! అది టైమ్ మెషీన్ కాదు. గ్రహాంతరవాసుల వాహనమూ కాదు. ఆకాశంలో పరిధోధనల నిమిత్తం హీలియం బెలూన్ సాయంతో ప్రయోగించిన ఓ పరికరం మాత్రమేనని నిపుణులు మొత్తుకోవాల్సి వచ్చింది.

ఆకాశంలో వింత..

ఆకాశంలో ఎగురుతూ వున్న బెలూన్ లాంటి ఆకారాన్ని చూసి చాలా ప్రాంతాల్లో ప్రజలు కంగారు పడ్డారు. పలువురు సినీ ప్రముఖులకూ ఈ విషయమై సందేహం వచ్చింది. కొందరు ఆ బెలూన్ తాలూకు వీడియోల్ని, ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నిపుణులు ఆ ఫొటోలు, వీడియోలపై స్పష్టతనిచ్చినా పుకార్లు మాత్రం ఆగలేదు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని మొగిలి గుండ్ల వద్ద దిగిన బెలూన్‌ని చూసి చాలామంది భయపడ్డారు. అంతలోనే, ఆ వస్తువుని చూసేందుకు జనం పోటెత్తారు.

అధికారులకు సమాచారం అందడంతో, అక్కడికి వెళ్ళి పరిశీలించి, అది ఆకాశంలో వాతావరణ ప్రయోగాల నిమిత్తం పంపిన బెలూన్, పరికరం అని తేల్చారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us