నా ఇంటి మీద వాళ్ళ పేర్లే ఉండాలే : గంగవ్వ

Admin - October 28, 2020 / 05:28 PM IST

నా ఇంటి మీద వాళ్ళ పేర్లే ఉండాలే : గంగవ్వ

బిగ్ బాస్, రియాలిటీ షో లో సందడి చేసిన గంగవ్వ అందరికి తెలిసిందే. అయితే చాలావరకు బిగ్ బాస్ లోకి రాకముందే గంగవ్వ అందరికి పరిచయం. ఎలా అంటే ఆమె యూట్యూబ్ ఛానల్ లో నటించినందున అందరికి సుపరిచితురాలు. ఇక ఎవరు ఊహించని స్థితిలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ కొన్ని రోజులు హౌస్ లో సందడి చేసింది. అయితే ఆమె మాట, కట్టు, బొట్టు అన్ని కూడా ప్రేక్షకులకు తెగ ఆసక్తిని నింపాయి. ఇక ఆమెకు బోగ్ బాస్ హౌస్ లో వాతావరణం పడక వెళ్ళిపోతా అని బోరున విలిపించింది. ఇక గంగవ్వ కోరిక మేరకు ఆమెను హౌస్ నుండి బయటకు పంపించారు.

అయితే గంగవ్వ బిగ్ బాస్ హౌస్ వెళ్ళడానికి కారణం ఆమె ఇల్లు నిర్మించుకోవడానికే అనే పలు సందర్భాల్లో తెలిపింది. ఇక గంగవ్వ కోరిక మేరకు ఇల్లు నిర్మిస్తామని ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేటప్పుడు నాగార్జున కూడా హామీ ఇచ్చాడు. ఇక గంగవ్వ స్వగ్రామం అయినా జగిత్యాల జిల్లా లంబాడిపల్లి లో ఆమెకు కోరుకున్న చోట ఇళ్లు నిర్మించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక తన ఇంటి మీద గంగవ్వ పేరు, బిగ్ బాస్ పేరు, అలాగే మై విలేజ్ షో పేర్లను రాయించి కొత్త ఇంట్లోకి వెళ్లాలని ఎదురుచూస్తున్నాని గంగవ్వ ఒక ఇంటర్ వ్యూ లో తెలిపింది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us