బిగ్ బాస్ కంటెస్టెంట్ లు వీరే..!

Advertisement

బిగ్ బాస్ 4 షో కోసం బుల్లితెర అభిమానులు అందరు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది కరోనా వల్ల బిగ్ బాస్ కాస్త ఆలస్యం అయ్యింది. ఏదైతేనేం ఎట్టకేలకు త్వరలో అభిమానుల ముందుకు రానుంది బిగ్ బాస్. అయితే ఈ సీజన్ కు కూడా ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. అయితే నాగార్జున కు సంబందించిన ప్రోమో కూడా ఈ మధ్య చక్కర్లు కొడుతుంది. కానీ ఈ షో లో ఎవరెవరు పాల్గొనబడుతున్నారనేది అందరిలో చర్చనియాంశంగా మారింది. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ చర్చ జరుగుతోంది.

అలాగే ఈ క్రమంలో ఓ లిస్ట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇక ఆ లిస్ట్ ప్రకారం హంసా నందిని, సింగర్ సునీత, సింగర్ మంగ్లీ, సింగర్‌ నోయల్‌, డ్యాన్స్ మాస్టర్‌ రఘు, నటుడు నందు, వైవా హర్ష, అఖిల్ సార్ధక్‌, యామిని భాస్కర్‌, అపూర్వ, జబర్ధస్త్‌ పొట్టి నరేష్‌, యూట్యూబర్ మహాతల్లి, యూట్యూబర్‌ మెహబూబా దిల్‌ సే, ప్రియా వడ్లమని, ఆటో రామ్ ప్రసాద్‌లు ఈ సారి బిగ్‌బాస్‌లో వీరందరూ కూడా కంటెస్టెంట్లు గా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ షో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం సోషల్‌ డిస్టేన్స్‌ని పాటిస్తూ టాస్క్‌లు ఉండబోతున్నట్లు సమాచారం వస్తుంది. అలాగే ఆగష్టు 22 నుంచి బిగ్‌బాస్‌ 4 ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్‌లో కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here