Bigg Boss 7 Telugu : ఐదు వారాలకు భోలే షావలికి అందిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

NQ Staff - November 14, 2023 / 10:28 AM IST

Bigg Boss 7 Telugu : ఐదు వారాలకు భోలే షావలికి అందిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Bigg Boss 7 Telugu :

బిగ్ బాస్ గురించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేషనల్ వైడ్ గా నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది ఈ షో. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ తోనే నడుస్తోంది. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పడం ఎవరి వల్ల కావట్లేదు. ఊహించిన విధంగా టాస్కులు జరుగుతున్నాయి. అంతే కాకుండా ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కూడా చాలా కష్టంగానే నడుస్తోంది. ఇప్పటికే షో పది వారాలు కంప్లీట్ చేసుకుంది. తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోయారు. రతిక రోజ్ ఒక్కతే రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే హౌస్ లో ఇప్పటి వరకు ఉన్న వారంతా కూడా సూపర్ కంటెస్టెంట్లు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరిని మించి ఒకరు ఆట ఆడుతున్నారు. ఇచ్చిన ప్రతి టాస్క్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఎలాగైనా హౌస్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారిలో భోలే షావలి కూడా ఒకడు. పాటల బిడ్డగా పేరు తెచ్చుకున్న మనోడు.. మొదటి నుంచి అందరితో కలిసిపోయేందుకు ప్రయత్నాలు చేస్తూ ఆట ఆడాడు. అయితే పదో వారంలో నామినేషన్స్ లో ఉన్న భోలే షావలి ఎలిమినేట్ కావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. వాస్తవానికి రతిక రోజ్ ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు.

కానీ ఆమె చివరి దశలో తప్పించుకుంది. ప్రిన్స్ యావర్, భోలే షావలి డేంజర్ జోన్ వరకు వెళ్లారు. ఎందుకంటే వీరిద్దరికీ ఓటింగ్ లో పెద్ద తేడా లేదు. అయితే చివరగా భోలేను మాత్రం ఎలిమినేట్ చేసేశారు. వాస్తవానికి భోలే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మాత్రం కాదు. కానీ ఆయన్ను ఎలిమినేట్ చేసేశాడు బిగ్ బాస్. గతంలో టేస్టీ తేజను కూడా అనూహ్యంగా ఎలిమినేట్ చేసేశాడు. దాంతో బిగ్ బాస్ మీద తీవ్ర మైన విమర్శలు వచ్చాయి. అప్పుడు శోభాశెట్టిని కాపాడేందుకు టేస్టీ తేజను ఎలిమినేట్ చేశారు. ఈ సారి రతిక కోసం భోలేను ఎలిమినేట్ చేశారు.

అయితే ఐదో వారంలో భోలే షావలి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఐదు వారాలకు గాను వారానికి రూ.2.5లక్షల చొప్పున మొత్తం 12లక్షలు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక భోలే షావలి ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్తే ఆయన కుటుంబీకులు, అభిమానులు మొత్తం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.

పదో వారంలోనే ఆయన భార్య హౌస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఇలా వచ్చిన వారమే అతను ఎలిమినేట్ అయ్యాడు. ఇక గజమాలతో ఆయన్ను సత్కరించారు ఆయన అనుబంధ వర్గం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us