Bhola Shankar Movie Got Negative Talk : భోళా ఎఫెక్ట్ ఆ సినిమాపై ఉండబోతుందా చిరు?
NQ Staff - August 11, 2023 / 07:05 PM IST

Bhola Shankar Movie Got Negative Talk :
మెగాస్టార్ చిరంజీవి వద్దు వద్దు అనుకుంటూనే వేదాళం ను ‘భోళా శంకర్’ అంటూ రీమేక్ చేసి పెద్ద తప్పు చేశాడు అంటూ మెగా ఫ్యాన్స్ కూడా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భోళా శంకర్ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. పైగా ఏపీలో ఈ సినిమాకు కాస్త గడ్డు పరిస్థితి ఉంది. దాంతో నిర్మాత కచ్చితంగా పెద్ద డ్యామేజీని ఎదుర్కోబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆ విషయం పక్కన పెడితే వేదాళం సినిమాను రీమేక్ చేయాలని మూడు సంవత్సరాల క్రితం మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ సమయంలో చిరంజీవి ఆసక్తిగా లేడని.. కానీ మెహర్ రమేష్ బంధుత్వం పేరుతో ఒప్పించి ఉంటాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అందుకే చిరంజీవి మళ్లీ రీమేక్ జోలికి వెళ్లకుండా ఉంటేనే ఉత్తమం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
బ్రో డాడీ పరిస్థితి ఏంటీ…?
మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్ చేసి పెద్ద తప్పు చేశాడు అంటూ కన్ఫర్మ్ అయింది. ఇక బ్రో డాడీ సినిమాను చిరంజీవి రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత నిర్మించేందుకు గాను ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు అయింది.

Bhola Shankar Movie Got Negative Talk
ఇలాంటి సమయంలో భోళా శంకర్ సినిమా ఫలితం రావడంతో బాబోయ్ రీమేక్ అంటూ మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అంతే కాకుండా మెగా ఫ్యాన్స్ బ్రో డాడీ సినిమా రీమేక్ వద్దే వద్దు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. భోళా శంకర్ సినిమా ఫెయిల్ నేపథ్యంలో బ్రో డాడీ సినిమా హోల్డ్ లో పడే అవకాశాలు లేకపోలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.