పీవీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో ఆమోదం

Advertisement

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కు భారతరత్న ఇవ్వాలని ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. సువిశాలమైన భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉంది. అలాగే గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థ కూడా ఉంది. కానీ ప్రధానిగా సేవలందించే అవకాశం కేవలం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఈ ప్రధాని పదవి చాలా అరుదుగా వస్తుంటుంది.

అలాంటి గొప్ప ఘనత మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దక్కింది. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. కేంద్ర సర్కార్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞశాలి, బహుభాషా కోవిదుడు. నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. పివి భారత దేశ చరిత్రలో నిలిచిపోవాలని, అందుకే పీవీ శతజయంతి ఉత్సవాలు సంవత్సరం పాటు నిర్వహిస్తున్నామని సీఎం కెసిఆర్ కొనియాడారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here