Bharat Rashtra Samithi : ఖమ్మంలో జనవరి 18న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ.!
NQ Staff - January 9, 2023 / 12:27 PM IST

Bharat Rashtra Samithi : ఖమ్మం వేదికగా భారత్ రాష్ట్ర సమితి తొలి భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర సమితిగా మారిన దరిమిలా, ఆ పార్టీ ఖమ్మం వేదికగా నిర్వహించనున్న తొలి బహిరంగ సభ తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ అవనుంది.
జనవరి 18న ఈ బహిరంగ సభను నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఈ బహిరంగ సభకు హాజరయ్యేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది.
ఖమ్మం.. ఎందుకు.?
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పే దిశగా మొన్నీమధ్యనే ఖమ్మం వేదికగా ఓ పెద్ద ‘షో’ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఖమ్మం కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు.
అందరి దృష్టీ ఖమ్మం వైపే ఎందుకు.? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం రెండు తెలుగు రాష్ట్రాలకూ సరిహద్దులో వుండడమే ఇందుకు కారణమన్న వాదనా లేకపోలేదు.