Balakrishna : మళ్లీ పరువు పోగొట్టుకున్న బాలయ్య.. ఇదేనా మీ సంస్కారం..!

NQ Staff - October 9, 2023 / 09:48 AM IST

Balakrishna : మళ్లీ పరువు పోగొట్టుకున్న బాలయ్య.. ఇదేనా మీ సంస్కారం..!

Balakrishna :

పద్ధతి, సంస్కారం అనే మాటలను బాలయ్య పదే పదే వాడుతుంటారు. వైసీపీ వాళ్లకు అది లేదని చెబుతూ ఉంటారు. ఇక చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఎక్కువగా బాలయ్య వాడుతున్న పదాలు ఇవే. తాను మాత్రమే పద్ధతితో ఉంటానని.. వైసీపీ వాళ్లకు అది లేదంటూ చెబుతుండేవాడు. అలాంటి బాలయ్య తాజాగా తన పరువు తానే తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్లో శ్రీలీల నటిస్తోంది.

అయితే ఆదివారం రాత్రి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ చేసి కామెంట్లు ఇప్పుడు ఆయన పరువును గంగలో కలిపేస్తున్నాయి. బాలయ్య ఏ ఈవెంట్ కు వెళ్లినా ముందుగా తన తండ్రిని తలచుకుని ఆయనకు గౌరవం సమర్పిస్తారు. తన తండ్రిని ఎంతో గౌరవించే బాలయ్య తన కొడుకును, కూతుర్లను అదే పద్ధతిలో పెంచానని చెబుతుండేవాడు. అయితే తాజాగా ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ.. నేను శ్రీలీలతో హీరోగా చేస్తాను అంటే.. నా కొడుకు మోక్షజ్ఞ ఏం బ్యాక్ గ్రౌండ్ బలిసిందా అంటూ అన్నాడని గుర్తు చేసుకున్నాడు బాలయ్య.

ఇదే ఇప్పుడు బాలయ్య పరువు పోగొట్టేసింది. తన తండ్రికి ఎంతో గౌరవం ఇచ్చే బాలయ్యకు.. ఆయన కొడుకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండి పడుతున్నారు నెటిజన్లు. మోక్షజ్ఞ తన తండ్రిని బ్యాక్ గ్రౌండ్ బలిసిందా అని ఎలా అంటాడు. ఒక కొడుకు తన తండ్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పైగా బాలయ్య తన కూతురుగా చేసిన శ్రీలీలతో హీరోగా చేస్తానని కోరుకున్నాడు. అంటే కూతురు పక్కన హీరోగా చేయాలని ఎలా అనుకుంటాడు. ఇదేనా బాలయ్య సంస్కారం అంటూ కడిగి పారేస్తున్నారు నెటిజన్లు.

నిత్యం మహిళలను కించపరుస్తూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్న బాలయ్యనా సంస్కారం గురించి మాట్లాడేది. మహిళలకు గౌరవం ఇవ్వాలని నిత్యం బాలయ్య చెబుతారు. కానీ తాను మాత్రం పాటించడన్నమాట. అదే చంద్రబాబు ఫ్యామిలీలోని ఆడవారికి గానీ, తన కుటుంబంలోని ఆడవారికి గానీ అవమానం జరిగితే టీడీపీ, ఎల్లో గ్యాంగ్ తో గగ్గోలు పెట్టిస్తారు.

కానీ ఇతర మహిళలను మాత్రం స్వయంగా వారే అవమానిస్తారన్నమాట. ఇది బాలయ్య అసలు సిసలైన సంస్కాం. తన చెల్లెలి పాత్రలో నటించిన కీర్తి సురేష్ చేయిని ఆప్యాయంగా పట్టుకున్నందుకే చిరుపై దారుణంగా విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు బాలయ్య ఇలాంటి మాటలు మాట్లాడినా సరే ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us