Bhagat Success Story : నాడు ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్..నేడు విలేజ్ కంపెనీకి సీఈవో..అసలెవరీ భరత్..!
NQ Staff - September 4, 2023 / 07:12 PM IST

Bhagat Success Story : నేటితరం యువత కన్న కలలు నేరవేరాలంటే నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి.ఏమాత్రం సమయం వృథా చేసినా చివరకు మన గురించి ప్రపంచం మాట్లాడుకునే అద్భుత అవకాశాన్ని మనం కోల్పోతాం.అందుకే ప్రతి ఒక్కరూ తమ డ్రీమ్స్‌పై ఫోకస్ చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దాదాసాహెబ్ భగత్ కన్న కల ఏమిటి? జీవితంలో అతను ఏం సాధించాడు? ప్రధాని మోడీ ఆయన్ను ఎందుకు ప్రశంసించారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఒకప్పుడు దాదాసాహెబ్ భగత్ ఇన్ఫోసిస్ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేసేవాడు.కానీ ఇప్పుడు ఆయన సొంతంగా స్టార్టప్ కంపెనీలను స్థాపించి సీఈవోగా మారారు.ఒక చిన్న పశువుల పాకలో ‘కాన్వా’, ‘డూ గ్రాఫిక్స్’ అనే యాప్స్ సొంతంగా డెవలప్ చేసి విలేజ్‌లోని వారికి ట్రైయినింగ్ ఇచ్చి మరీ ఉపాధి కల్పిస్తున్నారు.
మహారాష్ట్రలోని బీడ్‌కు చెందిన దాదాసాహెబ్ భగత్ 1994లో జన్మించారు.చదవు అనంతరం ఏదైనా పని చేసేందుకు సొంత గ్రామాన్ని వదిలి పూణెకు షిఫ్ట్ అయ్యారు.ఐటీఐ డిప్లమా ప్రోగ్రామ్ పూర్తి చేసిన భరత్..తొలుత రూమ్ సర్వీస్ బాయ్‌గా నెలకు రూ.9వేల జీతానికి ఓ చిన్న ఉద్యోగంలో చేరారు. పలువురి సూచనల మేరకు సాఫ్ట్వేర్ పై ఆసక్తి పెంచుకుని యానిమేషన్ అండ్ డిజైన్ కోర్సులో చేరాక హైదరాబాద్‌లో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.
అక్కడ డిజైన్ అండ్ గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఫైథాన్, సీ++ కోర్సులు నేర్చుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, టెంప్లెట్స్ లైబ్రరీలను సృష్టించడంపై దృష్టి సారించారు. అనంతరం వీటిని ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేయడం ప్రారంభించారు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో ఆయన కొంతకాలం మంచానికే పరిమితం అవ్వగా.. కరోనా టైంలో ఉద్యోగం వదిలేసి ఫుల్ టైమ్ స్టార్టప్ ప్రారంభించారు.
కొవిడ్ పుణ్యమా అని కాన్వా వంటి ఆన్ లైన్ గ్రాఫిక్స్ డిజైనింగ్ ప్లాట్‌ఫాం రూపొందించాలని భగత్ నిర్ణయించాడు.ఫలితంగా రెండో బిజినెస్ డూ గ్రాఫిక్స్‌ను తయారుచేశారు. ఇది సాధారణ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ ఫేస్‌ను కలిగి ఉంది. దీని యూజర్లు టెంప్లెట్, డిజైన్ లను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది.
కొవిడ్ టైంలో తన జాబ్ వదిలేసి బీడ్ గ్రామానికి వచ్చిన భగత్, 4జీ నెట్వర్క్ ను పశువుల కొట్టంలో ఏర్పాటు చేయించాడు. భగత్‌కు యానిమేషన్ అండ్ డిజైన్‌లో శిక్షణ పొందిన కారణంగా కొంతమంది స్నేహితులకు శిక్షణ ఇచ్చి వారితో కలిసి షెడ్‌లో సొంత కంపెనీని ప్రారంభించారు. అలా గ్రామం నుంచి చాలా మందికి డూగ్రాఫిక్స్‌లో శిక్షణ ఇచ్చి మౌలికసదుపాయాలు కల్పించి కార్యకలాపాలు ప్రారంభించారు.
కేవలం 6నెలల వ్యవధిలోనే 10వేల యాక్టివ్ కస్టమర్లను ఈ కాన్వా, డూ గ్రాఫిక్స్ స్టార్టప్స్ సాధించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగళూరుతో పాటు జపాన్, ఆస్ట్రేలియా, యూకే నుంచి కస్టమర్లు వీరికి ఉన్నారు. ఈ విషయం తెలిసుకున్న ప్రధాని భగత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని మోడీ ఆత్మనిర్బర్ భారత్ విజన్‌కు మద్దతుగా ‘డూ గ్రాఫిక్స్’ను పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన సాఫ్ట్వేర్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని భగత్ వెల్లడించారు.