కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
Admin - August 4, 2020 / 05:22 AM IST

భద్రాచలం: కరోనా మొత్తం ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. కొన్ని లక్షల మంది ప్రజలు కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది కరోనా వల్ల ఉపాధిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా భద్రాచలం నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా వల్ల కన్ను మూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా భారిన పడ్డ ఆయన విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
1999, 2004, 2014 ఎన్నికల్లో భద్రాచలం నియోజక వర్గం నుండి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ చాలా సాధారణ జీవితాన్ని గడిపేవారు. ఆటోలో అసెంబ్లీకి వెళ్లేవారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రంప చోడవరం నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
ఇండియాలో చాలా మంది రాజకీయ ప్రముఖులు కరోనా భారిన పడుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కరోనా భారిన పడ్డారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాణిక్యాల రావు కూడా కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోయారు.